
ఎలాంటి డబ్బు అవసరం లేకుండా ఈ కలబంద చిట్కాతో మొటిమలకు చెక్ పెట్టండి. ముందుగా ఆకు నుండి వైట్ జెల్ ను వేరు చేసి ముఖానికి అప్లై చేయండి. ఇలా చేయడం వలన చెడు బ్యాక్టీరియా నాశనం అవుతుంది. అలాగే, ఉదయం ఒకసారి రాత్రి పడుకునే ముందు ఒకసారి మొటిమల మీద అప్లై చేసి శుభ్రపరచండి

కలబందలో యాంటీ-ఆక్సిడెంట్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇది శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇది తీవ్రమైన అనారోగ్యాలతో పోరాడటానికి సహాయపడుతుంది. చర్మం నిర్జీవంగా మారితే.. అటువంటి వారికి కలబంద ఉత్తమమైనది. ఇందులో ఉండే విటమిన్ సి, విటమిన్ ఇ చర్మాన్ని ఫ్రీ రాడికల్ నష్టం నుంచి రక్షిస్తాయి. సహజమైన మెరుపును తెస్తాయి.

ఇలా చేయడం వలన మీ ముఖం కాంతి వంతంగా మెరుస్తుంది. బయట ప్రొడక్ట్స్ కి డబ్బులు పెట్టె బదులు మీ ఇంట్లో ఉన్న వాటితోనే మొటిమలను తగ్గించుకోవచ్చు. ఇది మీ ఫేస్ కి ఒక పవర్ఫుల్ మాస్క్ లా వర్క్ చేస్తుంది.

మీ కోసం ఇంకో చిట్కా .. ముందుగా నిమ్మరసం తీసుకుని, దానిలో 2 స్పూన్ల కలబంద గుజ్జు కూడా వేసి 5 నిముషాలు ఉంచి ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి 15 నిమిషాల పాటు ఉంచి గోరు వెచ్చని నీళ్ళతో వాష్ చేయండి.

కానీ, ఒక విషయం బాగా గుర్తు పెట్టుకోండి. మీరు మీ ముఖానికి కలబంద అప్లై చేసేటప్పుడు ముందుగా మీ ముఖాన్ని వాష్ చేసి అప్లై చేయండి. ఇలా చేయడం వలన నల్ల మొటిమలు పోవడంతో పాటు అందంగా కూడా ఉంటారు.