పెట్రోల్ ధరలు.. ఎన్నికలకు ముందు ఆ తర్వాత…!

ఎన్నికలు రాబోతున్న తరుణంలో బీజేపీ తీసుకునే నిర్ణయాలు భలే ఉంటాయి. అమాంతం ధరలు తగ్గుముఖం పడతాయి. ముఖ్యంగా ఉల్లిగడ్డల ధరలైనా, పెట్రోల్ ధరలైనా సరే కూడా. ఇదేమీ కొత్త కాదు. ఇప్పుడు పెట్రోల్ ధరలు రోజు రోజుకు తగ్గుతున్నాయని అందరికీ తెలిసిందే. ఎన్నికల ముందు ఇలాగే తగ్గుతాయనేది గత సార్వత్రిక ఎన్నికల్లో జరిగిన దాన్ని బట్టి అర్ధమవుతుంది. మళ్లీ ఇప్పుడు మూడు రాష్ట్రాల్లో జరగనున్న ఎన్నికలు ఊరిస్తున్నాయి. ఎన్నికలకు పెట్రోల్‌కు ఉన్న ఆ అనుబంధమే వేరు. హర్యానా, […]

పెట్రోల్ ధరలు.. ఎన్నికలకు ముందు ఆ తర్వాత...!
Follow us

| Edited By:

Updated on: Oct 14, 2019 | 10:10 PM

ఎన్నికలు రాబోతున్న తరుణంలో బీజేపీ తీసుకునే నిర్ణయాలు భలే ఉంటాయి. అమాంతం ధరలు తగ్గుముఖం పడతాయి. ముఖ్యంగా ఉల్లిగడ్డల ధరలైనా, పెట్రోల్ ధరలైనా సరే కూడా. ఇదేమీ కొత్త కాదు. ఇప్పుడు పెట్రోల్ ధరలు రోజు రోజుకు తగ్గుతున్నాయని అందరికీ తెలిసిందే. ఎన్నికల ముందు ఇలాగే తగ్గుతాయనేది గత సార్వత్రిక ఎన్నికల్లో జరిగిన దాన్ని బట్టి అర్ధమవుతుంది. మళ్లీ ఇప్పుడు మూడు రాష్ట్రాల్లో జరగనున్న ఎన్నికలు ఊరిస్తున్నాయి. ఎన్నికలకు పెట్రోల్‌కు ఉన్న ఆ అనుబంధమే వేరు.

హర్యానా, మహారాష్ట్ర, జార్ఘండ్ రాష్ట్రాల్లో ఈ నెలలో ఎన్నికలు జరగనున్నాయి. అందుకే బీజేపీ ఒక పద్దతిగా పెట్రోల్ ధరలను నియంత్రిస్తుందని సర్వత్రా వినిపిస్తున్న మాట. ఈ మాటలో నిజమెంతో ఒకసారి గమనిస్తే… సార్వత్రిక ఎన్నికల సమయంలోనూ, అంతకుముందు కర్ణాటక ఎన్నికల సమయంలో కూడా ఇదే విధానాన్ని కేంద్రం అమలుచేసింది. ప్రతి రోజు అప్ అండ్ డౌన్ అయ్యే పెట్రోల్ ధరల్లో తేడాలు గమనించే వాహనదారులకు ఆయా రాష్ట్రాల్లో ఎన్నికలు కాస్త ఊరటనిస్తున్నాయి. ఎన్నికల ముందు పెట్రోల్ ధరలు తగ్గడం, ఆ తర్వాత పెరగడం అనేది ఓ ట్రెండ్‌గా మారింది. తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల ఎన్నికలకు ముందు పెట్రోల్ ధరలు ఆకాశాన్నంటాయి. దీంతో నిరసనలు వ్యక్తం అయ్యే సరికి పెట్రోల్, డీజిల్‌పై కేంద్రం ఎక్సైజ్ సుంకాన్ని రూ.1.50 మేర తగ్గించింది. లీటర్‌కు రూ.1 తగ్గించాలని చమురు సంస్థలను కోరింది. తర్వాత అక్టోబర్ 18 నుంచి చమురు ధరలు క్రమంగా తగ్గుతూ వచ్చాయి. కేంద్రానికి పెట్రోల్ ఉత్పత్తులపై పన్నుల ద్వారా వచ్చే ఆదాయం కీలకం. ఇలాంటి పరిస్థితుల్లో అంతర్జాతీయంగా పెట్రోల్ ధరలు పెరిగితే పెట్రోల్ ధరలకు మళ్లీ రెక్కలు వస్తాయన్నది అందరికీ తెలిసిన విషయమే.

గత అనుభవాలను దృష్ట్యా.. పెట్రోల్ ధరలను ఎన్నికలకు ముందు .. ఆ తర్వాత అనే విధంగా బేరీజు వేసుకుంటున్నారు జనం. కర్ణాటక ఎన్నికల ముందు 20 రోజులపాటు పెట్రోల్ ధరలు పెరగలేదు. మే 12న ఎన్నికలు ముగిశాక 17 రోజుల్లోనే పెట్రోల్ ధర సుమారు నాలుగు రూపాయల మేర పెరిగింది. గత ఏడాది జనవరి 16 నుంచి ఏప్రిల్ 1 మధ్య పెట్రోల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. అప్పట్లో పంజాబ్, గోవా, ఉత్తరాఖండ్, యూపీ, మణిపూర్ రాష్ట్రాలకు ఎన్నికలు జరిగాయి. దీన్ని బట్టి ఎన్నికల ముందు పెట్రోల్ ధరలు తగ్గడం, తర్వాత పెరగడం అనేది బీజేపీ ఎన్నికల ఎత్తుగడగానే భావించాల్సి ఉంటుంది.