అమరావతిపై హైకోర్టులో పిల్… కాగ్‌తో లింకు?

ఏపీ రాజధాని అమరావతిపై రాష్ట్ర హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. అమరావతిలో రాజధాని నెలకొల్పితే జరిగే వయబిలిటీ ఆధారంగానే అక్కడే క్యాపిటల్ కొనసాగించాలా ? లేక మరో చోటికి తరలించాలా అనే విషయంలో తేల్చాలన్నది తాజా వ్యాజ్యం సారాంశం

అమరావతిపై హైకోర్టులో పిల్... కాగ్‌తో లింకు?
Follow us

|

Updated on: Mar 14, 2020 | 2:18 PM

Public interest litigation filed on Amaravati: ఏపీ రాజధాని అమరావతిపై రాష్ట్ర హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. అమరావతిలో రాజధాని నెలకొల్పితే జరిగే వయబిలిటీ ఆధారంగానే అక్కడే క్యాపిటల్ కొనసాగించాలా ? లేక మరో చోటికి తరలించాలా అనే విషయంలో తేల్చాలన్నది తాజా వ్యాజ్యం సారాంశం. దాంతో అమరావతి రాజధాని వివాదం కొత్త మలుపు తిరిగినట్లయ్యింది.

అమరావతి నగర నిర్మాణంపై ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌పై స్పందించిన ఏపీ హైకోర్టు.. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్), కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. అమరావతి నగర నిర్మాణంపై కాగ్‌తో అధ్యయనం చేయించాలని పిటిషనర్ నారాయణాచార్యులు హైకోర్టును ఆశ్రయించారు. నగర నిర్మాణానికయ్యే వ్యయం, ఆర్థిక భారం, వయబిలిటీపై అధ్యయనం చేయాలని పిటిషనర్ కోర్టును కోరారు. కాగ్ నివేదిక ఆధారంగా అమరావతిని రాజధానిగా కొనసాగించాలా వద్దా అన్న నిర్ణయం తీసుకోవాలని పిటిషనర్ హైకోర్టును అభ్యర్థించారు.

2014-19 మధ్యకాలంలో రాజధాని పేరిట జరిగిన అన్ని లావాదేవీలను ఆడిట్ చేయాలని కోరారు పిటిషనర్. పిటిషన్‌ను పరిశీలించిన హైకోర్టు విచారణకు స్వీకరించింది. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్)తోపాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారి చేసింది. తదుపరి విచారణను వాయిదా వేసింది.