సరిహద్దుల్లో మళ్లీ కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న పాక్‌

పాకిస్థాన్‌ సరిహద్దుల్లో మళ్లీ కవ్వింపులకు పాల్పడుతోంది. గత కొద్ది రోజులుగా నిత్యం కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ.. సరిహద్దుల వెంట కాల్పులకు తెగబడుతోంది. ఈ ఘటనల్లో..

సరిహద్దుల్లో మళ్లీ కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న పాక్‌
Follow us

| Edited By:

Updated on: Aug 10, 2020 | 5:28 AM

పాకిస్థాన్‌ సరిహద్దుల్లో మళ్లీ కవ్వింపులకు పాల్పడుతోంది. గత కొద్ది రోజులుగా నిత్యం కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ.. సరిహద్దుల వెంట కాల్పులకు తెగబడుతోంది. ఈ ఘటనల్లో పలువురు సామాన్యులు కూడా గాయపడుతున్నారు. చిన్నచిన్న ఆయుధాలు, మోర్టార్‌ షెల్స్‌ను ఉపయోగిస్తూ దాడులకు పాల్పడుతోంది. ఈ క్రమంలో సరిహద్దు వెంట ఉన్న గ్రామాల ప్రజలు భయం గుప్పిట్లో జీవిస్తున్నారు. తాజాగా ఆదివారం సాయంత్రం మరోసారి కాల్పులకు పాల్పడింది పాక్. పూంచ్ జిల్లాలోని షాహ్పూర్‌, కిర్నీ, క్రిష్ణ ఘటీ సెక్లార్ల మీదుగా కాల్పులకు తెగబడింది. ఈ విషయాన్ని ఇండియన్ ఆర్మీ అధికారులు తెలియజేశారు. కాగా, పాక్ కాల్పులను భారత్ ధీటుగా ఎదుర్కొంటూ.. పాక్‌కు గట్టి సమాధానం ఇస్తోందన్నారు.

Read More :

కర్ణాటక ఆరోగ్య మంత్రి శ్రీరాములుకు కరోనా

మహారాష్ట్రలో విజృంభిస్తోన్న కరోనా మహమ్మారి

తమిళనాడులో 3 లక్షలకు చేరువలో పాజిటివ్‌ కేసులు