క‌రోనాతో రెండ్రోజుల్లో ఇద్ద‌రు డాక్ట‌ర్లు మృతి

కంటికి క‌నిపించ‌ని శ‌త్రువుతో నిరంత‌ర యుద్ధం చేస్తున్న వైద్యులు వైర‌స్ బారిన ప‌డి ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా

క‌రోనాతో రెండ్రోజుల్లో ఇద్ద‌రు డాక్ట‌ర్లు మృతి
Follow us

|

Updated on: Apr 28, 2020 | 12:32 PM

బిమారిలా వ‌చ్చిన కోవిడ్‌..మ‌హ‌మ్మారిగా మారింది. ప‌ల్లెప‌ట్ట‌ణం అనే తేడా లేకుండా దేశంలో క‌రోనా స్వైర విహారం చేస్తోంది. ఇప్ప‌టికీ వ్యాక్సిన్ లేక‌పోవ‌డంతో వైర‌స్ భ‌యానికి  ప్ర‌పంచ దేశాలు గ‌డ‌ప‌దాట‌లంటే భ‌య‌ప‌డిపోతున్నాయి. అటువంటి క‌రోనాపై వైద్యులు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు సైన్యంలా ముందుండి పోరాడుతున్నారు. ఈ యుద్ధంలో పోలీసులు, డాక్టర్లు అదే వైరస్‌ బారినపడి మరణిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఇలా కరోనా వైరస్‌ బారినపడుతున్న పోలీసులు, డాక్టర్ల సంఖ్య కూడా పెరిగిపోవ‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంది. తాజాగా మ‌రోర డాక్ట‌ర్‌ని క‌రోనా మింగేసింది.
కంటికి క‌నిపించ‌ని శ‌త్రువుతో నిరంత‌ర యుద్ధం చేస్తున్న వైద్యులు వైర‌స్ బారిన ప‌డి ప్రాణాలు కోల్పోతున్నారు.  తాజాగా కోల్‌కతాలో ప్రముఖ ఆర్థోపెడిక్‌ డాక్టర్‌ సోమవారం రాత్రి మరణించారు. ఈ నెల 14న అనారోగ్యంతో నగరంలోని ఓ ప్రముఖ హాస్పిట్‌లో చేరిన 69 ఏళ్ల‌ ఆర్థోపెడిక్‌ డాక్టర్‌కు కరోనా పాజిటివ్‌ అని తేలింది. ఆరోగ్యం క్షీణించడంతో ఏప్రిల్‌ 17 నుంచి ఆయనకు వెంటీలేటర్‌ సాయంతో చికిత్స అందిస్తున్నారు. చికిత్స పొందుతున్న క్ర‌మంలోనే ఆయన సోమవారం రాత్రి మృతిచెందారు. ఇప్పటికే ఆరోగ్య శాఖలో అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేస్తున్న డా. బిప్లబ్‌ కాంతి దాస్‌గుప్తా అదే ఆస్ప‌త్రిలో ఆదివారం మరణించారు. దీంతో బెంగాల్‌లో ఈ ప్రాణాంతక వైరస్‌తో మరణించిన డాక్టర్ల సంఖ్య రెండుకు చేరింది.