ఒక్క చిన్న లింక్ ఆ టాపర్ జీవితాన్ని తలకిందులు చేసింది, ఇప్పుడు న్యాయపోరాటం చేస్తున్నాడు

అతడికి 18 ఏళ్లు. చిన్నప్పుడే తండ్రిని కోల్పోయాడు. రెండేళ్ల క్రితం తల్లి కూడా మరణించింది. ఇప్పుడు అతడు అనాథ. అయితేనేం..తనకు చదువుల తల్లి తోడుగా ఉందని భావించాడు.

ఒక్క చిన్న లింక్ ఆ టాపర్ జీవితాన్ని తలకిందులు  చేసింది, ఇప్పుడు న్యాయపోరాటం చేస్తున్నాడు
Follow us

|

Updated on: Nov 30, 2020 | 3:09 PM

అతడికి 18 ఏళ్లు. చిన్నప్పుడే తండ్రిని కోల్పోయాడు. రెండేళ్ల క్రితం తల్లి కూడా మరణించింది. ఇప్పుడు అతడు అనాథ. అయితేనేం..తనకు చదువుల తల్లి తోడుగా ఉందని భావించాడు. కసితో చదివాడు. జెఈఈలో అఖిల భారత ర్యాంకు 270 సాధించి, ఐఐటి-బొంబాయిలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ బిటెక్ కోర్సులో సీటు పొందాడు. అయితే అతడు సీటు సాధించిన రెండు వారాల్లోనే దాన్ని కోల్పోయాడు. వివరాల్లోకి వెళ్తే… ఆగ్రాకు చెందిన సిద్ధాంత్ బాత్రా, ఐఐటి-జెఈఈ (అడ్వాన్స్‌డ్) 2020 ను ర్యాంకు సాధించి, అక్టోబర్ 18 న రౌండ్ వన్‌లో ముందుకెళ్లాడు. అక్టోబర్ 31 న, అతను తన రోల్ నంబర్‌పై అప్ డేట్స్ కోసం వెతకడం ప్రారంభించాడు. ఈ క్రమంలో సీటు ఉపసంహరణ బటన్‌పై అనుకోకుండా క్లిక్ చేశాడు. తీరా చూస్తే.. నవంబర్ 10 న ప్రవేశం పొందిన విద్యార్థుల జాబితాలో అతని పేరు లేదు. ఉపసంహరణ లేఖకు వ్యతిరేకంగా పోరాడటానికి అతను బొంబాయి హైకోర్టును ఆశ్రయించాడు. నవంబర్ 19 న ధర్మాసనం తన పిటిషన్‌ను 2 రోజుల్లోపు రిప్రజెంటేషన్‌గా పరిగణించాలని ఐఐటికి ఆదేశించింది. అయితే ఐఐటి రిజిస్ట్రార్ ఆర్ ప్రేమ్‌కుమార్ ఉపసంహరణ లేఖను రద్దు చేసే అధికారం తమకు లేదని పేర్కొన్నారు. తన కోసం అదనపు సీటును కేటాయించాలని బాత్రా సుప్రీంకోర్టుకు వెళ్లారు. ప్రస్తుతం బాత్రా తన మామయ్య, అమ్మమ్మ కలిసి నివసిస్తున్నాడు. ఈ కేసును సుప్రీంకోర్టు డిసెంబర్ 1 న విచారించనుంది. మరి సుప్రీంలో అయినా అతని పోరాటానికి ఫలితం దక్కుతుందో, లేదో చూడాలి.

Also Read :

శ్రీవారి ప్రత్యేక దర్శన టికెట్లు విడుదల, పనిచెయ్యని టీటీటీ వెబ్‌సైట్, అసహనం వ్యక్తం చేస్తోన్న భక్తులు

AP Assembly : నేటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు..అస్త్రశస్త్రాలతో అధికార, ప్రతిపక్షాలు రెడీ !

Ind vs Aus : రెండో వన్డే​లో క్రేజీ సీన్, ఆసిస్ లేడీ ఫ్యాన్‌కు ప్రపోజ్ చేసిన ఇండియా కుర్రోడు

Latest Articles