ఆన్‌లైన్‌లో కల్లు విక్రయాలు.. ఒక్క కాల్ చేస్తే చాలు..

ఆన్‌లైన్‌లో కల్లు బుకింగ్‌..,ఫోన పే, గూగుల్ పే ద్వారా మని ట్రాన్సాక్షన్స్ . ఏంటీ నమ్మలేకపోతున్నారా...ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవడం వింతగా ఉందనుకుంటున్నారా...ఔన్ ఇది అక్షరాల నిజం. లాక్‌డౌన్ కారణంగా వైన్‌షాపులు

ఆన్‌లైన్‌లో కల్లు విక్రయాలు.. ఒక్క కాల్ చేస్తే చాలు..
Follow us

| Edited By:

Updated on: May 03, 2020 | 9:30 PM

ఆన్‌లైన్‌లో కల్లు బుకింగ్‌.., ఫోన్ పే, గూగుల్ పే ద్వారా మని ట్రాన్సాక్షన్స్ . ఏంటీ నమ్మలేకపోతున్నారా…ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవడం వింతగా ఉందనుకుంటున్నారా…ఔన్ ఇది అక్షరాల నిజం. లాక్‌డౌన్ కారణంగా వైన్‌షాపులు మూతపడటంతో మద్యం ప్రియులు తాళ్ల వనం వైపు క్యూ కట్టారు. దీంతో ప్రకృతి సిద్ధంగా లభించే కల్లుకు భారీగా డిమాండ్ పెరిగింది.మద్యం ప్రియులంతా కళ్లు మండువాల వైపు దారి పట్టడంతో కల్లు దొరికే పరిస్థితి లేదు. దీంతో రెండు,మూడు రోజుల ముందే ఆన్ లైన్‌లో బుక్ చేసుకుంటున్నారు కల్లు ప్రియులు.

ఉమ్మడి కరీంనగర్ జిల్లా సుల్తానాబాద్ ఏరియాలో ఇది ఎక్కువగా కనిపిస్తోంది. ఆన్‌లైన్‌లో కల్లు బుక్ చేసుకోవడమే కాదు…డబ్బులు కూడా ఆన్‌లైన్‌ ద్వారానే పే చేస్తున్నారు. కల్లు గీత కార్ముకుల ఫోన్‌ నంబర్ తీసుకొని..వారికి గూగుల్‌ పే, ఫోన్‌ పే చేస్తున్నారు. లేదంటే నేరుగా వారి అకౌంట్లోకి డబ్బులు పంపిస్తున్నారు. మొత్తంగా కల్లు బుక్ చేసుకోవడంతో పాటు అమౌంట్ కూడా ఆన్‌లైన్‌లో పంపిస్తున్నారు. లాక్‌డౌన్ కారణంగా కల్లు దొరకడంలేదని వాపోతున్నారు కల్లు ప్రియులు. ప్రకృతి సిద్ధంగా లభించే కల్లును తాము ఎక్కువగా తాగుతామని,అయితే…లిక్కర్ షాపులు మూతపడటంతో మద్యం ప్రియులు కల్లు ఎక్కువగా తాగుతున్నారని, దీంతో కల్లు దొరకడంలేదని గ్రామస్తులు చెబుతున్నారు.

40 రోజులుగా మద్యం షాపులు మూతపడటంతో కల్లు దొరక్కుండా పోయిందని కల్లు ప్రియులు చెబుతున్నారు. లాక్‌డౌన్‌కు ముందు ఉదయం,సాయంత్రం పూట కల్లు పుష్కలంగా లభించేదని,ఇప్పుడు రెండు రోజుల ముందు బుక్ చేసుకోవల్సి వస్తుందంటున్నారు. లాక్‌డౌన్ కారణంగా గిరాకీ పెరిగిందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు కల్లుగీత కార్మికులు.గతంలో గిరాకీ ఎక్కువగా ఉండేది కాదంటున్నారు. 40రోజులుగా వ్యాపారం జోరుగా సాగుతుందన్నారు. డబ్బులు కూడా ముందుగానే అకౌంట్లో పడుతున్నాయని హర్షం వ్యక్తం చేస్తున్నారు.