125 అడుగుల అంబేద్కర్ విగ్రహానికి మోక్షమెప్పుడు ?

officials await kcrs nod to kickstart construction of 125 feet ambedkar statue, 125 అడుగుల అంబేద్కర్ విగ్రహానికి మోక్షమెప్పుడు ?
హైదరాబాద్ లో 125 అడుగుల ఎత్తయిన అంబేద్కర్ భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని తెలంగాణా సీఎం కేసీఆర్ ప్రకటించి మూడేళ్ళు అయింది. అయితే  ఈ ప్రాజెక్టు ఇంకా ఫైళ్ళ మధ్యే నలుగుతోంది.అప్పటి డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి నేతృత్వాన ఏర్పాటైన క్యాబినెట్ సబ్-కమిటీ చైనాను సందర్శించి ఈ విగ్రహం ఏర్పాటుకు సంబంధించిన టెక్నిక్ లను అధ్యయనం చేసింది. ఓ సమగ్ర ప్రాజెక్టు రిపోర్టును రూపొందించాల్సిందిగా ఓ కన్సల్టెంటును ఈ కమిటీ కోరిన విషయం తెలిసిందే.కానీ ఆ తరువాత ఇప్పటివరకు ఈ ప్రాజెక్టు ఎక్కడవేసిన గొంగళి అక్కడే ఉన్న చందంగా ఉంది. ఇందుకు కారణాలు చాలా ఉన్నాయని ఓ అధికారి అన్నారు. గత ఆరు నెలలుగా ఎన్నికల సంబంధ విధుల్లో అధికారులు బిజీగా ఉన్నారని, అయితే ప్రస్తుతం ఈ ఫైలు కేసీఆర్ వద్ద ఉందని ఆయన తెలిపారు. ఆయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే పనులు మొదలవుతాయని చెప్పారు. వచ్చే ఏడాది అంబేద్కర్ జయంతి నాటికి విగ్రహం ఏర్పాటు కావచ్చునని ఆశిస్తున్నట్టు ఆ అధికారి పేర్కొన్నారు. ఈ విగ్రహ నిర్మాణానికి ఢిల్లీకి చెందిన డిజైన్ అసోసియేట్స్ సంస్థ ప్రాజెక్టు నివేదికను రూపొందించిందని, ఈ ప్రాజెక్టు మొత్తం వ్యయం
రూ.100 కోట్లని తెలుస్తోంది. నెక్లెస్ రోడ్ సమీపాన ఎన్టీఆర్ గార్డెన్స్ వద్ద ఈ భారీ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *