కల్లుగీత కార్మికుల ఆస్తిత్వానికి ‘నీరా కేఫ్’‌ ప్రతీక

కులవృత్తులతో గ్రామీణ ఆర్థికవ్యవస్థ బలోపేతం అవుతున్నదని మంత్రి కేటీఆర్ అన్నారు. కల్లుగీత కార్మికుల ఆస్తిత్వానికి 'నీరా కేఫ్'‌ ప్రతీకగా నిలుస్తుందని అన్నారు.....

కల్లుగీత కార్మికుల ఆస్తిత్వానికి 'నీరా కేఫ్'‌ ప్రతీక
Follow us

|

Updated on: Jul 24, 2020 | 6:02 AM

కులవృత్తులతో గ్రామీణ ఆర్థికవ్యవస్థ బలోపేతం అవుతున్నదని మంత్రి కేటీఆర్ అన్నారు. కల్లుగీత కార్మికుల ఆస్తిత్వానికి ‘నీరా కేఫ్’‌ ప్రతీకగా నిలుస్తుందని అన్నారు. తెలంగాణ ఏర్పడిన నాటినుంచి కులవృత్తులకు పునర్వైభవం తీసుకొచ్చేదుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ కృషిచేస్తున్నారని తెలిపారు. హైదరాబాద్‌లోని నెక్లెస్‌రోడ్‌లో ‘నీరాకేఫ్‌’ శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రి కేటీఆర్‌ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. మంత్రులు వీ శ్రీనివాస్‌గౌడ్‌, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, పువ్వాడ అజయ్‌కుమార్‌, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు.