Breaking: న్యూజిలాండ్‌లో కొత్తగా 13 కరోనా కేసులు

న్యూజిలాండ్‌లో దాదాపు 100 రోజుల తరువాత మళ్లీ కరోనా కేసులు నమోదవుతున్నాయి

Breaking: న్యూజిలాండ్‌లో కొత్తగా 13 కరోనా కేసులు
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Aug 16, 2020 | 1:32 PM

కరోనా కట్టడిలో విజయం సాధించినట్లు చెప్పుకున్న న్యూజిలాండ్‌లో కొత్తగా కొవిడ్ పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. న్యూజిలాండ్‌లో దాదాపు 100 రోజుల తరువాత మళ్లీ కరోనా కేసులు నమోదవుతున్నాయి. గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 13మందికి కరోనా వైరస్ సోకినట్లు ఆ దేశ వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. కొత్త కేసులలో ఒకటి మినహా మిగతావన్నీ కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్లు ద్వారా వ్యాప్తి చెందినట్లు అధికారులు తెలిపారు. కరోనా సోకిన 13వ వ్యక్తి ఇటీవల విదేశాల నుంచి రాగా ప్రస్తుతం క్వారంటైన్‌లో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఇక, ప్రస్తుతం న్యూజిలాండ్‌లో మొత్తం యాక్టివ్‌ కేసుల సంఖ్య 69కు చేరింది.

ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు ప్రబలుతున్నవేళ న్యూజీలాండ్ ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. దేశ సరిహద్దుల‌ను మూసివేసిన 3 నెలల తరువాత క‌రోనా మహమ్మారిని త‌రిమికొట్టిన‌ట్లు న్యూజిలాండ్ ప్రధాని ప్రకటించారు. అయినప్పటికీ ఆ దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,271కు పెరిగింది. ఇదిలావుంటే, 102 రోజుల తర్వాత మళ్లీ కొత్త కేసులు వెలుగుచూడడంతో న్యూజీలాండ్ రాజధాని ఆక్లాండ్‌లో 12 రోజుల పాటు లాక్‌డౌన్‌ విధిస్తున్నట్లు ప్రధాన మంత్రి జెసిండా ఆర్డెర్న్ ప్రకటించారు. దేశంలో కోవిడ్ -19 నియంత్రణ కోసం 12 రోజుల పాటు లాక్‌డౌన్‌ విధిస్తున్నట్లు తెలిపారు.

Latest Articles