లక్షల బేరం.. రాజ్ తరుణ్ కేసులో కొత్త నిజం..

Actor Raj Tarun Car Accident Case Latest Updates, లక్షల బేరం.. రాజ్ తరుణ్ కేసులో కొత్త నిజం..

హీరో రాజ్ తరుణ్ కారు ప్రమాదం కేసు మరోసారి సంచలనంగా మారింది. కారు యాక్సిడెంట్ కేసును వీడియో తీసిన కార్తిక్ అనే వ్యక్తి ఆ వీడియోలను బయటపెట్టాడు. మూడు రోజుల క్రితం నార్సింగ్ అల్కాపూర్ టౌన్‌షిప్‌లో రాజ్ తరుణ్ కారు గోడను ఢీ కొట్టింది. ఆ తర్వాత తరుణ్ కారు దిగి పరుగులు పెట్టాడు. ఆ సమయంలో కార్తిక్ రాజ్ తరుణ్‌ను వెంబడించి పట్టుకున్నాడు. కాసేపు ఇద్దరి మధ్య వాదనలు జరిగాయి. ఆ తర్వాత రాజ్ తరుణ్ మేనేజర్ రాజా రవీంద్ర కార్తిక్‌కు ఫోన్ చేసి బెదిరించారు. ఆడియో టేపును ఇస్తే రూ. 5 లక్షలు ఇస్తామని కూడా ఆఫర్ చేశారు. అతడు అంగీకరించకపోవడంతో బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో కార్తిక్ ఆ వీడియోలను బయటపెట్టాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *