Viral: నడిరోడ్డుపై నగ్నంగా నర్సు.. ఇంతలో పోలీసుల ఎంట్రీ.. అసలేం జరిగిందంటే.?

|

Feb 25, 2023 | 12:21 PM

రాజస్థాన్‌లోని జైపూర్‌లో నడిరోడ్డుపై ఓ మహిళ నగ్నంగా నిరసన చేపట్టింది. ఆ రోడ్డుపై వెళ్తున్న వారంతా ఆ మహిళను చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశారు..

Viral: నడిరోడ్డుపై నగ్నంగా నర్సు.. ఇంతలో పోలీసుల ఎంట్రీ.. అసలేం జరిగిందంటే.?
Viral News
Follow us on

రాజస్థాన్‌లోని జైపూర్‌లో నడిరోడ్డుపై ఓ మహిళ నగ్నంగా నిరసన చేపట్టింది. ఆ రోడ్డుపై వెళ్తున్న వారంతా ఆ మహిళను చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశారు, పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు.. మహిళను నిలువరించే ప్రయత్నం చేశారు. దుస్తులు వేసుకోవాలని మహిళా కానిస్టేబుళ్లు విజ్ఞప్తి చేశారు. దానికి ఆ మహిళ తిరస్కరించింది. చేసేదేం లేక.. ఆమెపై పోలీసులు దుప్పటి కప్పారు. అనంతరం బలవంతంగా పోలీస్​స్టేషన్‌కు తీసుకెళ్లారు.

బేవార్‌లో ఉన్న ఆసుపత్రిలో ఏఎన్​ఎమ్​గా పనిచేసేదాన్ని. 2020లో ఆసుపత్రి యాజమాన్యం నన్ను సస్పెండ్​ చేసింది. అనంతరం ఏపీఓగా నియమించింది. కానీ ఇప్పటికి పోస్టింగ్ ఇవ్వలేదు. ఎన్ని సార్లు అధికారులకు విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదు. అందుకే ఇలా నిరసన చేపట్టాను” అని మహిళా నర్సు పోలీసులకు తెలిపింది. అయితే పోలీసులు మాత్రం.. ఆమె మానసిక స్థితి సరిగ్గా లేదని చెప్పుకొచ్చారు.(Source)