Watch: దారుణం.. భార్యను బైక్ కు కట్టేసి ఈడ్చుకెళ్లిన భర్త..! షాకింగ్ వీడియో..

ఈ క్రమంలోనే ఒక రోజున ఆమె జైసల్మేర్‌లో ఉంటున్న తన సోదరి ఇంటికి వెళ్తానని భర్తకు చెప్పడంతో అతడు నిరాకరించాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలోనే తీవ్ర కోపోద్రిక్తుడైన అతడు.. మద్యం మత్తులో భార్యను చితకబాది అనంతరం ఆమె కాళ్లకు తాడు కట్టాడు. ఆ తాడును బైక్‌కు కట్టి గ్రామంలోకి ఈడ్చుకెళ్లాడు.

Watch: దారుణం.. భార్యను బైక్ కు కట్టేసి ఈడ్చుకెళ్లిన భర్త..! షాకింగ్ వీడియో..
Man ties wife to bike, drags her around village in Rajasthan’s Nagaur

Updated on: Aug 15, 2024 | 2:58 PM

రాజస్థాన్‌లోని నాగౌర్ జిల్లాలో ఓ దారుణమైన వార్త వెలుగులోకి వచ్చింది. ఓ మహిళను బైక్‌ వెనుకకు కట్టేసి ఊరంతా ఈడ్చుకెళ్లాడు ఆమె భర్త. ఈ ఘటనను స్థానికులు ఎవరో వీడియో తీయగా, అది వైరల్‌గా మారింది. దీంతో ఒక నెల రోజుల తర్వాత పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం బాధిత మహిళ వారి తల్లిదండ్రుల వద్దనే ఉంటోంది. నహర్‌సింగ్‌పురా గ్రామంలో నెల రోజుల క్రితం ఈ ఘటన జరిగిందని పంచౌరి పోలీస్ స్టేషన్ అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ సురేంద్ర కుమార్ తెలిపారు. మేఘ్‌వాల్ అనే యువకుడు తన భార్యను తన మోటార్‌సైకిల్‌కు వెనుకకు తాడుతో కట్టి గ్రామానికి లాక్కెళ్లాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…నహరసింగ్‌పుర గ్రామంలో మేఘ్‌వాల్ అనే వ్యక్తి తాగుడు బానిసగా మారాడు. రోజూ పీకల దాకా తాగేసి మద్యం మత్తులో తరచూ భార్యను వేధించేవాడు. ఈ క్రమంలోనే ఒక రోజున ఆమె జైసల్మేర్‌లో ఉంటున్న తన సోదరి ఇంటికి వెళ్తానని భర్తకు చెప్పడంతో అతడు నిరాకరించాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలోనే తీవ్ర కోపోద్రిక్తుడైన అతడు.. మద్యం మత్తులో భార్యను చితకబాది అనంతరం ఆమె కాళ్లకు తాడు కట్టాడు. ఆ తాడును బైక్‌కు కట్టి గ్రామంలోకి ఈడ్చుకెళ్లాడు.

దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో పోలీసులు కేసు నమోదు చేసి అతడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ప్రస్తుతం భార్య బంధువుల ఇంట్లో ఉన్నట్టు సమాచారం. ఆమె ఇప్పటివరకు ఫిర్యాదు చేయలేదని పోలీసులు వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us