విరిగిపడిన కొండచరియలు.. బద్రినాథ్‌కు రాకపోకలు అంతరాయం..!

భారీగా కురుస్తున్న వర్షాలకు అనేక ప్రాంతాలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉత్తరాఖండ్‌ ప్రాంతంలో అయితే నిత్యం కురుస్తున్న భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడుతున్నాయి. దీంతో అనేక ప్రాంతాల్లో..

విరిగిపడిన కొండచరియలు.. బద్రినాథ్‌కు రాకపోకలు అంతరాయం..!
Follow us

| Edited By:

Updated on: Jul 20, 2020 | 5:30 AM

భారీగా కురుస్తున్న వర్షాలకు అనేక ప్రాంతాలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉత్తరాఖండ్‌ ప్రాంతంలో అయితే నిత్యం కురుస్తున్న భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడుతున్నాయి. దీంతో అనేక ప్రాంతాల్లో రాకపోకలకు తీవ్ర అంతరాయం నెలకొంటుంది. తాజాగా ఆదివారం నాడు కురిసిన భారీ వర్షాలకు బద్రీనాథ్‌ జాతీయ రహదారిపై కొండచరియలు విరిగిపడ్డాయి.భనేర్‌పానీ, పిపల్‌కోటీ ప్రాంతాల్లో ఈ సంఘటన చోటుచేసుకుంది. రోడ్డుపై కొండచరియలు విరిగిపడటంతో ఇరువైపు వాహనాలు వెళ్లేందుకు వీలులేకుండా అయ్యింది. రంగలోకి దిగిన ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. ఇరువైపు వాహనాల్లో చిక్కుకుపోయిన వాహనదారులకి ఆహార పదార్థాలను అంజేశారు. కొండచరియలు తొలగించడానికి దాదాపు పన్నెండు నుంచి పదహారు గంటల సమయం పడుతుందని అధికారులు తెలిపారు. ఈ రహదారిపై భారీ వర్షాలు కురిసిన ప్రతిసారీ సహజంగానే కొండచరియలు విరిగిపడతాయన్నారు.

కాగా,పితోర్‌ఘర్‌ ప్రాంతంలో కూడా భారీ కొండచరియలు విరిగిపడ్డాయి. దార్‌కోట్ ప్రాంతంలోని మున్సిరయి మిలం మార్గ్ వద్ద పెద్ద పెద్ద కొండచరియలు విరిగిపడి రోడ్డుపై పడ్డాయి. దీంతో వాహనాదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.