Molestation Complaint: ప్రతీకారంతో మహిళ ముక్కు కోసేశాడు.. ఇంతకీ ఏం జరిగిందంటే..

మూడేళ్ల కిందట తనపై ఆ మహిళ వేధింపుల కేసు నమోదు చేయించిందన్న కక్షతో ఓ దుర్మార్గుడు మహిళపై దాడి చేసి, కొడవలితో ఆమె ముక్కు కోసేశాడు. ఈ షాకింగ్‌ ఘటన ఉత్తరప్రదేశ్‌లో సోమవారం (ఏప్రిల్‌ 3) చోటుచేసుకుంది..

Molestation Complaint: ప్రతీకారంతో మహిళ ముక్కు కోసేశాడు.. ఇంతకీ ఏం జరిగిందంటే..
Molestation Complaint

Updated on: Apr 05, 2023 | 8:44 AM

మూడేళ్ల కిందట తనపై ఆ మహిళ వేధింపుల కేసు నమోదు చేయించిందన్న కక్షతో ఓ దుర్మార్గుడు మహిళపై దాడి చేసి, కొడవలితో ఆమె ముక్కు కోసేశాడు. ఈ షాకింగ్‌ ఘటన ఉత్తరప్రదేశ్‌లో సోమవారం (ఏప్రిల్‌ 3) చోటుచేసుకుంది. పోలీసు సూపరింటెండెంట్ (రూరల్) సంజీవ్ బాజ్‌పాయ్ తెలిపిన వివరాల ప్రకారం..

ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రంలోని షాజహాన్‌పుర్‌ జిల్లాకు చెందిన ఓ గ్రామంలో నివాసం ఉంటున్న రాజేష్ కుమార్ ఓ మహిళను మూడేళ్ల క్రితం వేధింపులకు గురి చేశాడు. విసిగిన మహిళ పోలీసులకు రాజేష్‌పై ఫిర్యాదు చేసింది. మహిళపై ప్రతీకారం తీర్చుకునేందుకు అప్పటి నుంచి రాజేష్‌ అదును కోసం వేచిఉన్నాడు. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం మార్కెటుకు వెళుతున్న మహిళపై దాడి చేసి, కొడవలితో ఆమె ముక్కును కోసేశాడు. దాడి అనంతరం బాధిత మహిళ స్పృహ తప్పి పడిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు బాధిత మహిళను ఆసుపత్రికి తరలించారు. పరారీలో ఉన్న నిందితుడు రాజేశ్‌కుమార్‌పై కేసు నమోదు చేసి గాలిస్తున్నట్లు గ్రామీణ ఏఎస్పీ సంజీవ్‌ బాజ్‌పాయ్‌ తెలిపారు. మూడేళ్ల కిందట తనపై ఆ మహిళ వేధింపుల కేసు నమోదు చేయించిందని, అందుకే కక్షతో నిందితుడు ఈ దారుణానికి తెగించినట్లు పోలీసులు వెల్లడించారు. .

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us