Anurag Thakur: ఇకపై ఉత్తమ వెబ్‌ సిరీస్‌లకు కేంద్రం అవార్డులు.. కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్‌ ప్రకటన

|

Jul 18, 2023 | 9:47 PM

ఇకపై కేంద్ర ప్రభుత్వం ఉత్తమ వెబ్‌ సిరీస్‌లకు అవార్డులను ప్రకటించనుంది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ స్వయంగా తెలిపారు. ట్విట్టర్‌ వేదికగా ఈ విషయమై ఆయన పోస్ట్ చేశారు. గోవాలో జరిగే ఇంటర్నేషనల్ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఆఫ్‌ ఇండియాలో 'బెస్ట్‌ వెబ్‌ సిరీస్‌' క్యాటగిరీలో ఈ అవార్డును అందించనున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు...

Anurag Thakur: ఇకపై ఉత్తమ వెబ్‌ సిరీస్‌లకు కేంద్రం అవార్డులు.. కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్‌ ప్రకటన
Anurag Thakur
Follow us on

ఇకపై కేంద్ర ప్రభుత్వం ఉత్తమ వెబ్‌ సిరీస్‌లకు అవార్డులను ప్రకటించనుంది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ స్వయంగా తెలిపారు. ట్విట్టర్‌ వేదికగా ఈ విషయమై ఆయన పోస్ట్ చేశారు. గోవాలో జరిగే ఇంటర్నేషనల్ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఆఫ్‌ ఇండియాలో ‘బెస్ట్‌ వెబ్‌ సిరీస్‌’ క్యాటగిరీలో ఈ అవార్డును అందించనున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు. భారత దేశంలో చిత్రీకరించి, భారతీయ భాషల్లో అందుబాటులో ఉన్న వెబ్‌ సిరీస్‌ల్లో బెస్ట్‌ సిరీస్‌కు అవార్డు అందించనున్నట్లు మంత్రి పేర్కొన్నారు.

టెక్నికల్‌తో పాటు ఇతర విభాగాల్లో ఉత్తమంగా నిలిచినవి బరిలో నిలుస్తాన్నాయన్న మంత్రి.. ఓటీటీలో పెట్టుబడులను ప్రోత్సహించడానికి, భారతీయ భాషల్లో కంటెంట్‌ను తీసుకురావడం, భారతీయుల ట్యాలెంట్‌ను గుర్తించడమే ఈ అవార్డుల ప్రధానోత్సవ ముఖ్య లక్ష్యమని కేంద్ర మంత్రి వివరించారు. 54వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో ఈ ఏడాది నుంచి ఈ అవార్డును ఏటా ప్రధానం చేయనున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు. భారత దేశం అసాధారణ ప్రతిభతో నిండి ఉందన్న మంత్రి, ప్రపంచానికి చెప్పాల్సిన ఎన్నో కథలను చూపించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుందంటూ ట్వీట్‌ చేశారు.

ఇవి కూడా చదవండి

దేశంలో తొలిసారిగా ఓటీటీలో ప్రసారమైన వెబ్‌ సిరీస్‌లకు అవార్డులను అందించనున్నారు. ఈ అవార్డుకు ఎంపికైన వెబ్‌సిరీస్‌కు సర్టిఫికేట్‌తో పాటు రూ. 10 లక్షల ప్రైజ్‌ మనీ అందించనున్నారు. భారతీయ భాషల్లో ఓటీటీ కంటెంట్‌ను ప్రోత్సహించడం కోసమే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..