కారు కొనే ముందు టెస్ట్ డ్రైవ్ ముఖ్యమే. పికప్ ఎలా ఉంది..? వాహనంలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అనేది టెస్ట్ డ్రైవ్ చేస్తే తెలిసిపోతుంది. అయితే ఈ రోజుల్లో టెస్ట్ డ్రైవ్ పేరుతో కారుతో పరారయ్యే కేటుగాళ్లు కూడా పెరిగిపోయారు. తాజాగా అలాంటి కేసే ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో గురువారం (సెప్టెంబర్ 26) వెలుగుచూసింది. ఇద్దరు యువకులు టెస్ట్ డ్రైవ్ చేస్తామని అడిగి కారుతో పరారయ్యారు. ఎంతసేపటికీ రాకపోవడంతో కారు షోరూం వాళ్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
గ్రేటర్ నోయిడాలోని సెకండ్ హ్యాండ్ కార్ షోరూమ్‌ను ఇద్దరు వ్యక్తులు గురువారం సందర్శించారు. షోరూం మొత్తం తనిఖీ చేసి.. అక్కడ ఉన్న ఎస్‌యూవీ నచ్చిందని.. కొనుగోలు చేస్తానని చెప్పారు. అయితే కార్ టెస్ట్ డ్రైవ్ చేస్తామని.. వారు కోరారు. దీంతో తన సిబ్బందిలో ఒకరితో కలిసి వారు.. కార్‌ని తీసుకుని టెస్ట్ డ్రైవ్‌కి వెళ్లారు. అయితే కొంత దూరం వెళ్లిన తర్వాత షోరూం ఉద్యోగిని కారులో నుంచి కిందకు తోసి.. ఆ ఇద్దరు కారుతో పరారయ్యారు. కారును తీసుకెళ్లిన దృశ్యాలు షోరూమ్‌లోని సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. కారును బయటికి తీసుకెళ్లిన వారు తిరిగి రాకపోవడంతో షోరూం యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
సమాచారం అందుకున్న నాలెడ్జ్ పార్క్ పోలీసులు కేసు నమోదు చేసుకుని పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. అలాగే కారు యజమానికి, కొనుగోలుదారుకు మధ్య ఏమైనా వివాదం ఉందా అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. అయితే కారును తీసుకెళ్లిన వ్యక్తులకు సంబంధించిన సమాచారం తమ వద్ద లేదేని షోరూం యజమాని చెప్పడంతో దుండగుల గుర్తింపును గుర్తించడం సవాలుగా మారింది.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..