TV9 WITT Summit 2024: FCRA చట్టాన్ని మరింత బలోపేతం చేస్తామన్న అమిత్ షా.. CAA అమలుపై ఏమన్నారంటే?

|

Feb 27, 2024 | 10:42 PM

TV9 నెట్ వర్క్ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తోన్న 'వాట్ ఇండియా థింక్స్ టుడే' పవర్ కాన్ఫరెన్స్ కార్యక్రమంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో మత మార్పిడుల కోసం విదేశాల నుంచి భారీగా నిధులు వస్తున్నాయని, వీటికి పూర్తిస్థాయిలో అడ్డుకట్టవేస్తామన్నారు

TV9 WITT Summit 2024: FCRA చట్టాన్ని మరింత బలోపేతం చేస్తామన్న అమిత్ షా.. CAA అమలుపై  ఏమన్నారంటే?
Union Minister Amit Shah
Follow us on

TV9 నెట్ వర్క్ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తోన్న ‘వాట్ ఇండియా థింక్స్ టుడే’ పవర్ కాన్ఫరెన్స్ కార్యక్రమంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో మత మార్పిడుల కోసం విదేశాల నుంచి భారీగా నిధులు వస్తున్నాయని, వీటికి పూర్తిస్థాయిలో అడ్డుకట్టవేస్తామన్నారు అమిత్‌ షా. ఎఫ్‌సీఆర్‌ఏ చట్టంలో సవరణ విషయంపై అమిత్ షా మాట్లాడుతూ మత మార్పిడుల కోసమైతే ఎన్‌జిఓల డబ్బును భారత్‌కు రానివ్వబోమన్నారు. ‘ దేశంలో FCRA చట్టాన్ని బలోపేతం చేస్తాం. ఇందులో భాగంగా ఎన్నారైలు తమ నిధులకు సంబంధించి పూర్తి సమాచారం ఇవ్వాలి. తమ లక్ష్యాల గురించి చెప్పాలి. అలాగే వారి ఖాతాలను కూడా ఆడిట్ చేస్తాం. అన్నీ సక్రమంగా ఉంటే మిమ్మల్నీ ఎవరూ ఆపలేరు. మీ లక్ష్యం ,ప్రోగ్రామ్, ఆడిట్ సరిగ్గా లేకుంటే మాత్రం మిమ్మల్ని అడ్డుకుంటాం’ అని అమిత్‌ షా పేర్కొన్నారు. ఇదే సమావేశంలో CAA చట్టంపై అమిత్ షా మాట్లాడుతూ, ఈ చట్టం ప్రజలకు రాజకీయ సమస్య కావచ్చు, కానీ ఇది ఒక పెద్ద సామాజిక సంస్కరణ అని అన్నారు. దేశంలో ఏ మతం ఆధారంగా చట్టం ఉండకూడదనేది ప్రజాస్వామ్య ప్రాథమిక డిమాండ్ అన్నారు.

‘దేశ చట్టం నేటి పరిస్థితులకు అనుగుణంగా, ప్రజల ప్రయోజనాలకు అనుగుణంగా ఉండాలి. దేశంలోని శాసనసభ, పార్లమెంటు తగిన సమయంలో ఏకరూప పౌర చట్టాన్ని తీసుకువచ్చి దేశంలో అమలు చేయాలని మన రాజ్యాంగ సభ కూడా ఆర్టికల్ 44లో లక్ష్యాన్ని నిర్దేశించింది. భారతీయ జనతా పార్టీ స్థాపించినప్పటి నుంచి 370 ఆర్టికల్ తొలగిస్తామని, ఏకరూప పౌర చట్టం తెస్తామని, ట్రిపుల్ తలాక్‌ను రద్దు చేస్తామని, 1990 నుంచి అయోధ్యలో రామమందిరం కట్టాలని చెబుతున్నాం. ఇవి కొత్తవేమీ కాదు, పార్టీ స్థాపించినప్పటి నుండి మా డిమాండ్లు ఉన్నాయి. ఈ దేశ రాజ్యాంగం మేము అలా చేయాలని ఆశిస్తున్నాం’ అని చెప్పుకొచ్చారు.

ఇక 2024 ఫలితాల తర్వాత ఇండియా కూటమి విచ్ఛిన్నమవుతుందని జోస్యం చెప్పారు అమిత్ షా. ఇండియా కూటమి అనేది అధికార దాహం, అత్యాశ, కుటుంబ ఆధారిత పార్టీల కూటమి. ఈ కూటమిని ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు అమిత్ షా.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..