TV9 Global Summit: ప్రస్తుతం ప్రపంచం దృష్టి భారత్‌పైనే.. టీవీ9 గ్లోబల్ సమ్మిట్‌లో బరున్ దాస్

|

Feb 25, 2024 | 5:40 PM

ఈ వేదికగా దేశ రాజకీయాలే కాకుండా ప్రపంచ పరిస్థితులపై కూడా చర్చించనున్నారని చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే కాన్క్లేవ్ ప్రారంభానికి ముందు, TV9 నెట్‌వర్క్ MD అండ్‌ CEO బరున్ దాస్ కేంద్ర క్రీడా మంత్రి అనురాగ్ ఠాకూర్‌కు శాలువా కప్పి స్వాగతం పలికారు. ఇక బరున్‌ దాస్‌ మాట్లాడుతూ..

TV9 Global Summit: ప్రస్తుతం ప్రపంచం దృష్టి భారత్‌పైనే.. టీవీ9 గ్లోబల్ సమ్మిట్‌లో బరున్ దాస్
Tv9 Md And Ceo Barun Das
Follow us on

దేశంలోనే అతిపెద్ద న్యూస్‌ నెట్‌ వర్క్‌ టీవీ9 ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘వాట్ ఇండియా టుడే థింక్స్’ గ్లోబల్ సమ్మిట్ 2024 ప్రారంభమైంది. అతిథులను స్వాగతిస్తూ, TV9 నెట్‌వర్క్ MD అండ్‌ CEO బరున్ దాస్ మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈరోజు TV9 రెండవ ఎడిషన్ ‘వాట్ ఇండియా థింక్స్ టుడే’ సమ్మిట్ ప్రారంభమైందని అన్నారు. వచ్చే రెండు రెండు రోజుల్లో అనేక మంది అంతర్జాతీయ ఆలోచనాపరులు, క్యాబినెట్ మంత్రులు, పరిశ్రమల ప్రముఖులకు ఆతిథ్యం ఇవ్వబోతున్నాము అని అన్నారు.

ఈ వేదికగా దేశ రాజకీయాలే కాకుండా ప్రపంచ పరిస్థితులపై కూడా చర్చించనున్నారని చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే కాన్క్లేవ్ ప్రారంభానికి ముందు, TV9 నెట్‌వర్క్ MD అండ్‌ CEO బరున్ దాస్ కేంద్ర క్రీడా మంత్రి అనురాగ్ ఠాకూర్‌కు శాలువా కప్పి స్వాగతం పలికారు. ఇక బరున్‌ దాస్‌ మాట్లాడుతూ.. ఈ సాయంత్రం చాలా ప్రత్యేకైందని చెప్పడానికి తాను సంతోషిస్తున్నానన్నారు. గ్లామర్‌కు మాత్రమే పరిమితం కాకుండా క్రీడలు, వినోదం, ఆర్థిక, సైనిక రంగం, మేధస్సు సహా దేశంలోని అన్ని రంగాల విశిష్టతకు ఈ సదస్సు వేదిక అవుతుందన్నారు. దేశ బోల్డ్ విజన్ గురించి ఇందులో మేధోమథనం జరుగుతుందన్నారు.

ఆయన ఇంకా మాట్లాడుతూ.. ఈ రోజు సాయంత్రం సమ్మిట్‌లో భారతదేశానికి చెందిన సాఫ్ట్‌ వపర్‌పై దృష్టి పెడుతున్నట్లు పేర్కొన్నారు. భారత దేశాన్ని యోగా, వేదాలు, ఆయుర్వేదాల భూమిగా పిలుస్తారని అయితే ఇటీవల భారత్‌ కూడా ప్రపంచంలోని అద్భుతమైన సినిమా కథలను చెప్పే దేశంగా మారుతోందని తెలిపారు. ఒకప్పుడు బాలీవుడ్‌కు మాత్రమే పరిమితమైన ఇండియన్‌ మూవీ ఇప్పుడు శాండల్‌వుడ్‌, కోలీవుడ్‌, టాలీవుడ్‌లోనూ సినిమాలు మ్యాజిక్‌ చేస్తున్నాయని అన్నారు. ఈ సందర్భంగా బరున్‌ దాస్‌ ట్రిపులార్‌ సినిమాలోని నాటు నాటు సాంగ్‌ను ప్రస్తావించారు.

ఇక అదే సమయంలో క్రీడా దేశంగా భారత బలం పెరుగుతోందన్న బరున్ దాస్‌, గత కొన్ని దశాబ్దాలుగా మన క్రికెటర్లు నిరంతరం మనల్ని గర్వపడేలా చేస్తున్నారు. ఇది కాకుండా, భారతదేశం తనదైన ముద్ర వేస్తున్న అనేక ఇతర క్రీడలు కూడా ఉన్నాయన్నారు. క్రీడాకారుల అసాధారణ ప్రతిభకు బరున్‌ దాస్ ధన్యవాదాలు తెలిపారు. ప్రపంచ స్థాయిలో భారత్‌ బలంగా మారడంపై బరున్‌ దాస్‌ మాట్లాడుతూ.. ప్రపంచ స్థాయిలో ఎదుగుతోన్న భారత్‌ తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంటోందన్నారు. క్రీడలు, చలనచిత్రాలు, సంగీత పరిశ్రమలో భారతదేశానికి అపారమైన అవకాశాలు ఉన్నాయన్నారు.

వాట్ ఇండియ్ థింక్స్ కార్యక్రమాన్ని లైవ్ లో చూడడానికి ఇక్కడ క్లిక్ చేయండి.