Sorvagsvatn lake: సముద్రంపై ఉన్న అందమైన సరస్సు.. చూస్తే షాకవ్వాల్సిందే

|

Jul 16, 2023 | 1:26 PM

సాధారణంగా నదులు సముద్రంలో కలిసే ప్రదేశాలు మీరు చూసే ఉంటారు. కానీ సముద్రానికి ఎత్తులో సరస్సు ఉండటం చూశారా ?. మీరు విన్నిది నిజమే. ఇలాంటి దృశ్యాన్ని చూడాలంటే డైన్మార్క్ సమీపంలోని ఫోరే దీవులుకు వెళ్లాల్సిందే. ఇక్కడి వాగర్ ద్వీపం వద్ద సర్వాగ్‌స్వాటన్ సరస్సు ప్రవహిస్తోంది. 3.4 చదరపు కి.మీ విస్తీర్ణంలో ఉన్న ఈ సరస్సు చివరికి సముద్రంలో కలుస్తుంది.

1 / 5

2 / 5
అయితే ఇక్కడ కొన్ని పాయింట్లను గమనిస్తే ఈ సరస్సు సముద్రంపై నుంచి వేరే చోటుకు వెళ్తుందా అన్న అనుమానం కలుగుతుంది. కానీ అది ఓ ప్రదేశానికి రాగానే చిన్న జలపాతంలా మారుతుంది. చివరికి సముద్రంలోకి దూకుతుంది. అయితే ఈ దృశ్యాలను చూసేందుకు ప్రపంచ నలుమూలుల నుంచి అనేక మంది పర్యాటకులు వస్తుంటారు.

3 / 5
ఈ సరస్సును సర్వాగ్‎స్వాటన్ అని కొందరు పిలుస్తారు. మరికొందరు లైటిస్వాటన్ అని అంటారు. సరస్సుకు పశ్చిమాన ఉన్న సర్వాగుర్ స్థానికులు సర్వాగ్‌స్వాటన్ అని అంటారు. అలాగే తూర్పున ఉన్న శాండ్‌వాగర్ ప్రాంతంలో నివసించే వారు లైటిస్వాటన్‌ అని పిలుస్తుంటారు.

4 / 5
అయితే ఈ సర్వాగ్‌స్వాటన్ సరస్సు సముద్రానికి దగ్గర్లో ఉంటుంది. ఇది సముద్ర మట్టానికి 40 మీటర్ల ఎత్తులో ఉంటుంది. కానీ ఇది చూసేవారికి వందల మీటర్ల ఎత్తులో ఉందో అన్న భ్రమ కలుగుతుంది. అలాగే ఈ సరస్సు చుట్టూ కొండ శిఖరాలు నీటికి  సముద్రంలోకి వెళ్లకుండా అడ్డుకుంటాయి. ఈ సరస్సు నుంచి సముద్రంలోకి దూకే జలపాతాన్ని మాత్రం బోస్‌దలాఫోజర్ అని అంటారు.

5 / 5
రెండో ప్రపంచ యుద్ధంలో ఈ ఫోరే దీవుల్ని బ్రిటిష్ వారు ఆక్రమించారు. జర్మనీకి చెందిన యుద్ద నౌకలను ఆపేందుకు ఇక్కడ ఓ వైమానిక కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేశారు. శత్రువుల బారీన పడకుండా ఉండేందుకు ఈ ప్రదేశాన్ని ఎంచుకున్నారు. 1941లో ఓ యుద్ధ విమానం కూడా ఇక్కడ దిగడం విశేషం