‘ముంబై నటికి వై ప్లస్ సెక్యూరిటీ, హత్రాస్ కుటుంబానికి మొండిచెయ్యి !’

ముంబై నటి (కంగనా రనౌత్) కి వై ప్లస్ సెక్యూరిటీని కల్పించారని,, కానీ, హత్రాస్ కుటుంబానికి కేంద్రం మొండి చెయ్యి చూపుతోందని మహారాష్ట్రలోని పాలక శివసేన నిప్పులు కక్కింది.

'ముంబై నటికి వై ప్లస్ సెక్యూరిటీ, హత్రాస్ కుటుంబానికి మొండిచెయ్యి !'
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Oct 06, 2020 | 3:26 PM

ముంబై నటి (కంగనా రనౌత్) కి వై ప్లస్ సెక్యూరిటీని కల్పించారని,, కానీ, హత్రాస్ కుటుంబానికి కేంద్రం మొండి చెయ్యి చూపుతోందని మహారాష్ట్రలోని పాలక శివసేన నిప్పులు కక్కింది. కేంద్రం లోని బీజేపీ ప్రభుత్వం ద్వంద్వ ప్రమాణాలను పాటిస్తోందని, సమాజంలోని వివిధ వర్గాల పట్ల వేర్వేరు రకాల ట్రీట్మెంట్ ను అనుసరిస్తోందని ఈ పార్టీ తన ‘సామ్నా’ పత్రిక ఎడిటోరియల్ లో ఆరోపించింది. ఒక పేద కుటుంబానికి ప్రాణ హాని పొంచి ఉంది. అలాంటప్పుడు ఆ ఫ్యామిలీకి వై ప్లస్ భద్రత కల్పిస్తే తప్పేమిటి అని శివసేన ప్రశ్నించింది. ఇలాంటి కుటుంబాలను నిర్లక్ష్యం చేయాలని అంబేద్కర్ రాజ్యాంగం చెబుతోందా ? జరిగిన దారుణంపై జుడిషియల్ దర్యాప్తును బాధిత కుటుంబం కోరుతుంటే, యూపీ ప్రభుత్వం సీబీఐ విచారణకు ఆదేశించడమేమిటని సేన నేతలు నిలదీశారు. బాధితురాలి డెడ్ బాడీని దహనం చేయడం ద్వారా ఆ ప్రభుత్వం సాక్ష్యాధారాలను నాశనం చేసిందని వారు దుయ్యబట్టారు.