Drugs: విమానాశ్రయంలో రూ.60 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. అనుమానంతో బ్యాగ్‌ను చెక్ చేయగా..

|

Aug 21, 2022 | 7:59 PM

మాదక ద్రవ్యాల అక్రమ రవాణా ఆగడం లేదు. తాజాగా.. ఓ ప్రయాణికుడి నుంచి 60 కోట్ల రూపాయల విలువైన మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు.

Drugs: విమానాశ్రయంలో రూ.60 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. అనుమానంతో బ్యాగ్‌ను చెక్ చేయగా..
Drugs
Follow us on

Drugs seized in Cochin airport: అధికారులు ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ.. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా ఆగడం లేదు. తాజాగా.. ఓ ప్రయాణికుడి నుంచి 60 కోట్ల రూపాయల విలువైన మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. తాజాగా.. కేరళలోని కొచ్చి విమానాశ్రయంలో అధికారులు భారీగా డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. కొచ్చి విమానాశ్రయ భద్రతా సిబ్బంది ఓ ప్రయాణికుడి నుంచి 30 కేజీల డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ మాదక ద్రవ్యాల​విలువ అంతర్జాతీయ మార్కెట్లో రూ.60 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. జప్తు చేసిన డ్రగ్స్‌ను పరీక్షల నిమిత్తం ల్యాబ్​కు పంపామని అధికారులు తెలిపారు.

డ్రగ్స్​సరఫరా చేసిన వ్యక్తి పాలక్కడ్‌కు చెందిన మురళీధరన్ నాయర్‌గా అధికారులు గుర్తించారు. నాయర్ జింబాబ్వే నుంచి దోహా మీదగా ఢిల్లీ వచ్చాడని.. అక్కడి నుంచి ఎయిర్ ఏషియా విమానంలో కొచ్చి విమానాశ్రయానికి వచ్చినట్లు అధికారులు తెలిపారు. కాగా.. అనుమానాస్పదంగా కనిపించడంతో సిబ్బంది తనిఖీలు చేశారు. ఈ క్రమంలో నిందితుడి బ్యాగ్‌లో ఉన్న 30 కేజీల డ్రగ్స్ బయటపడినట్లు అధికారులు తెలిపారు.

అధునాతన త్రీడీ ఎమ్ఆర్ఐ స్కానింగ్ యంత్రం ఉపయోగించి డ్రగ్స్‌ను గుర్తించినట్లు కొచ్చి విమానాశ్రయ అధికారులు తెలిపారు. కాగా.. ఈ ఘటన కేరళలో సంచలనంగా మారింది. నిందితుడు డ్రగ్స్ ను ఎవరికి సప్లై చేస్తున్నాడు.. దీని వెనుక ఎవరున్నారు అనే విషయాలపై ఆరా తీస్తున్నట్లు అధికారులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి