Lalu Prasad Yadav: నాన్న శరీరంలో కదలికలు లేవు.. లాలూ ఆరోగ్య పరిస్థితిపై కుమారుడు తేజస్వి యాదవ్..

|

Jul 07, 2022 | 1:30 PM

Lalu Prasad Yadav Health Updates: బిహార్‌ మాజీ ముఖ్యమంత్రి, రాష్ట్రీయ జనతా దళ్ (RJD) అధినేత లాలు ప్రసాద్ యాదవ్‌ (74) ఆరోగ్యం ఇంకా అత్యంత విషమంగానే ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఢిల్లీలోని ఎయిమ్స్‌ ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు.

Lalu Prasad Yadav: నాన్న శరీరంలో కదలికలు లేవు.. లాలూ ఆరోగ్య పరిస్థితిపై కుమారుడు తేజస్వి యాదవ్..
Lalu Prasad Yadav
Follow us on

Lalu Prasad Yadav Health Updates: బిహార్‌ మాజీ ముఖ్యమంత్రి, రాష్ట్రీయ జనతా దళ్ (RJD) అధినేత లాలు ప్రసాద్ యాదవ్‌ (74) ఆరోగ్యం ఇంకా అత్యంత విషమంగానే ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఢిల్లీలోని ఎయిమ్స్‌ ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. అయితే వైద్యులు ఎన్ని మందులు ఇస్తున్నా ఆయన ఆరోగ్యం మెరుగుపడట్లేదని తనయుడు తేజస్వి చెబుతున్నారు. ‘నాన్న శరీరంలో ఎలాంటి కదలికలు ఉండడం లేదు. వైద్యులు చాలా మందులు ఇస్తున్నారు. అయినా ఆయన ఆరోగ్యంలో ఎలాంటి పురోగతి కనిపించడం లేదు. వైద్యులు మరోసారి పరిశీలించిన తర్వాత ఏం చేయాలనే దానిపై నిర్ణయం తీసుకుంటాం’ అని తేజస్వి పేర్కొన్నారు. కాగా దాణా కుంభకోణం కేసులో బెయిల్‌పై బయట ఉన్న లాలూ ఆదివారం ఇంట్లో మెట్లపై నుంచి జారి పడిపోయారు. ఈ ప్రమాదంలో ఆయన కుడి భుజం బాగా దెబ్బతింది.

దీంతో లాలూను కుటుంబ సభ్యులు పాట్నాలోని పరాస్‌ ఆస్పత్రికి తరలించారు. అయితే అక్కడ ఆయన పరిస్థితి మెరుగుపడకపోగా విషమించింది. దీంతో వెంటనే ఎయిర్‌ అంబులెన్స్ లో ఢిల్లీ ఎయిమ్స్‌కు తరలించారు. ప్రస్తుతం అక్కడే ఆయన చికిత్స పొందుతున్నారు. కాగా యాదవ్ ఇప్పటికే షుగర్‌తోపాటు మూత్రపిండాలు, గుండె సంబంధిత సమస్యలతో సహా పలు వ్యాధులతో బాధపడుతున్నారు. కాగా లాలూ పరిస్థితి విషమించిన నేపథ్యంలో పలువురు బిహార్‌ మంత్రులు, రాజకీయ ప్రముఖులు ఢిల్లీ ఎయిమ్స్‌కు చేరుకుంటున్నారు. కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్‌ ఆస్పత్రికి వచ్చి వైద్యులతో మాట్లాడారు. లాలూ ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అంతకుముందు లాలూ చికిత్సకు అయ్యే ఖర్చును రాష్ట్ర ప్రభుత్వం భ‌రిస్తుంద‌ని బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ చెప్పారు. బుధ‌వారం పాట్నాలోని పరాస్ ఆసుప‌త్రికి వెళ్లి లాలూను ఆయ‌న ప‌రామ‌ర్శించారు. ఆయ‌న త్వరగా కోలుకోవాలని ఆకాక్షించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి