Rani Karnavati: చరిత్ర చెప్పని పాఠం ఈ యోధురాలు.. ముక్కులు కత్తిరించే రాణిగా ఖ్యాతి..

|

Apr 14, 2022 | 3:51 PM

Rani Karnavati: చరిత్రలో వీరులైన రాజులు, వారి రాజ్యం, శత్రువుల నుంచి వారు తమ రాజ్యాన్ని రక్షించుకోవడం.. అందుకు వారు ప్రదర్సించిన ధైర్య సాహసాల గురించి చదువుకుంటున్నాం..

Rani Karnavati: చరిత్ర చెప్పని పాఠం ఈ యోధురాలు.. ముక్కులు కత్తిరించే రాణిగా ఖ్యాతి..
Rani Karnavati
Follow us on

Rani Karnavati: చరిత్రలో వీరులైన రాజులు, వారి రాజ్యం, శత్రువుల నుంచి వారు తమ రాజ్యాన్ని రక్షించుకోవడం.. అందుకు వారు ప్రదర్సించిన ధైర్య సాహసాల గురించి చదువుకుంటున్నాం.. అయితే తమ రాజ్యం కోసం పోరాడిన మహిళా యోధురాళ్లు అని అడిగితె.. ఎక్కువ మంది చెప్పే పేర్లు రాణి ఝాన్సీ లక్ష్మీబాయి(Rani Lakshmibai), రాణి రుద్రమ దేవి( Rani Rudrama Devi) వంటి పేర్లు.. అయితే చరిత్ర పుటల్లో చోటు చోసుకొని.. చరిత్ర పుస్తకాలు మరచిపోయిన మహిళా యోధురాలు అనేక మంది ఉన్నారు. వారిలో ఒకరు రాణీ కర్ణావతి.. ఈమెను ముక్కులు కత్తిరించే రాణి అని కూడా పిలిచేవారు. ఈరోజు గర్హ్వాల్‌ రాణి కర్ణావతి గురించి తెలుసుకుందాం..

భారతీయ చరిత్రలో మహిళా యోధుల ఉనికి ఆదర్శప్రాయమైనది. చాలా మంది రాణులు ఆక్రమణదారుల నుండి తమ శౌర్య ప్రతాపాలను ప్రదర్సించి తమ రాజ్యాలను కాపాడుకున్నారు. అలంటి రాణి కర్ణావతి. ప్రస్తుత ఉత్తరాఖండ్‌లో ఉన్న గర్హ్వాల్ రాజ్యానికి చెందిన అంతగా తెలియని రాజ్యం.

గర్హ్వాల్‌ను 823లో కనక్ పాల్ స్థాపించారు. 1622లో సింహాసనాన్ని అధిష్టించిన మహిపత్ షా రాజధానిని శ్రీనగర్‌కు మార్చారు. అయితే.. రాణీ కర్ణావతి తన భర్త మహిపతి షా 1631లో చిన్నవయసులోనే మరణించాడు. రాజ్యానికి వారసుడైన  ఏడేళ్ల పృథ్వీపతి షా పెద్ద అయ్యి రాజ్యపాలన చేపట్టేవరకూ గర్వాల్ ప్రాంతానికి పాలకురాలిగా రాణి కర్ణావతి మారింది.

రాణి కర్ణావతి మహిపత్ షా భార్య. బాధ్యతలన్నీ తన భుజస్కంధాలపై మోయాలని నిర్ణయించుకుని, మహిళలు కూడా రక్షకులుగా, పరిపాలకులుగా ఉండగలరని నిరూపించింది. ఆక్రమణదారులకు వ్యతిరేకంగా ఆమె శౌర్యం, ధైర్యంతో పోరాడింది. రాజ్య రక్షణ చేసింది.

అయితే గర్హ్వాల్ వెండి, రాగి, బంగారు గనులతో సమృద్ధిగా ఉండే ప్రాంతం. ఇది షాజహాన్ దృష్టిని ఆకర్షించింది. మహీపత్ షా తనను సందర్శించడానికి నిరాకరించడంతో గర్వాల్‌పై దండయాత్ర చేయాలని నిర్ణయించుకున్నాడు. అయితే అదే సమయంలో మహిపత్ షా మరణం..  గర్వాల్‌పై ప్రాంతంపై దాడి చేయాలనే మొఘల్ చక్రవర్తి సంకల్పాన్ని బలపరిచింది.

గర్హ్వాల్‌ను రాణి పరిపాలిస్తోందని తెలిసి, గర్హ్వాల్‌ను కబళించేయడానికి షాజహాన్ కప్పం కట్టి, సామంత రాజ్యంగా తనకింద బతకమని చెప్పాడు. అయితే రాణి కర్ణావతి.. తాను సామంతరాజ్యాన్ని కోరుకొను అని.. రణమే అని తేల్చి చెప్పింది.  తత్ఫలితంగా, షాజహాన్ 1640లో జనరల్ నజబత్ ఖాన్ ఆధ్వర్యంలో 30,000 మంది తన భారీ సైన్యాన్ని పంపాడు.

ఈ యుద్ధం గురించి ప్రముఖ ఇటాలియన్ యాత్రికుడు,  రచయిత నికోలో మనుచి మొఘలులకు ..  రాణి కర్ణావతికి మధ్య జరిగిన యుద్ధం గురించి వివరించారు. రాణి మొఘల్ సైనికుల బృందాన్ని.. అప్పట్లో లక్ష్మణ్ జూలా అని పిలవబడే ప్రదేశంలో నిలిపివేసిందని అతను వివరించాడు. రాణి కర్ణావతి మొఘల్ ముష్కర దళాలను పర్వతశ్రేణుల్లోకి  రానిచ్చి, వెనక్కి పారిపోయే దారిని మూసేసింది. ముందు ఏముందో తెలీదు, వెనక్కి పారిపోయే దారి లేకపోవడంతో “ఓటమి ఒప్పుకుంటూ, సంధి చేసుకుందాం” అంటూ  మొఘల్ జనరల్ నజబత్ ఖాన్ పిలుపునిచ్చాడు. అయితే శాంతి ఒప్పందాన్ని రాణి తిరస్కరించింది. “కుదరదు, రణమే” అని సమాధానం చెప్పింది.

రాణి మొఘలుల సైన్యంతో ఒక ఆట ఆడుకుంది. చివరకు ఒక షరతుపై వారిని విడుదల చేయడానికి అంగీకరించింది. ఆమె మొఘల్ సైనికుల ముక్కులు కట్టించుకోవాలి..  లేదా చనిపోవాలని ఆదేశించింది. ప్రాణాలు కాపాడుకోవడానికి రాణి పెట్టిన షరత్తుని అంగీకరించడం తప్ప ఇంకేమీ చేయలేని స్థితిలో రాణి పెట్టిన కండిషన్ ను అంగీకరించారు.

మొఘల్ సైనికుల జనరల్ నజబత్ ఖాన్ సహా మొత్తం 30,000 మంది సైనికుల ముక్కులను కత్తిరించింది. అనంతరం  షాజహాన్ మళ్ళీ తన జీవిత కాలంలో గర్హ్వాల్‌ వైపే కన్నెత్తి చూడలేదు.  తన రాజ్యాన్ని కాపాడుకోవడంలో  విజయం సాధించింది. దీంతో అప్పటి నుండి రాణి కర్ణావతిని ‘నాక్-కటీ-రాణి’ (ముక్కులు కత్తిరించేసే రాణి) అని పిలుస్తారు.

రాణి కర్ణావతి కేవలం యోధ రాణి మాత్రమే కాదు. ఆమె దార్శనికురాలు కూడా. డెహ్రాడూన్ జిల్లాలోని నెవాడా వద్ద స్మారక కట్టడాలను నిర్మించింది. డెహ్రాడూన్‌లోని తొలి కాలువలలో ఒకటైన రాజ్‌పూర్ కాలువను నిర్మించినందుకు ఆమె ప్రశంసించబడింది. స్త్రీలు దుర్బలంగా భావించబడినప్పుడు. ఈ రాణి తన రాజ్యాన్ని మొఘలుల నుండి రక్షించుకుంది. పాలనలో కూడా అనేక సంస్కరణలు తీసుకొచ్చి ప్రజలను జనరంజకంగా పాలించింది. ఈ రాణి కథను యూరోపియన్ దేశాలు వారు గుర్తు చేసుకుంటూ ఉంటారట.

Also Read: Viral Video: సీసా మూత గొంతులో ఇరుక్కుని ఉక్కిరిబిక్కిరి అయిన స్టూడెంట్.. సమయస్ఫూర్తితో రక్షించిన టీచర్