కేరళలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ట్రాక్టర్ ర్యాలీ, రైతు చట్టాల విషయంలో ప్రధానిపై మళ్ళీ ఫైర్

రైతు చట్టాలకు నిరసనగా ఆందోళన చేస్తున్న అన్నదాతల విషయంలో ప్రధాని మోదీ సైలెంట్ గా ఉన్నారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. పాప్ స్టార్లంతా..

  • Umakanth Rao
  • Publish Date - 7:47 pm, Mon, 22 February 21
కేరళలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ట్రాక్టర్ ర్యాలీ, రైతు చట్టాల విషయంలో ప్రధానిపై మళ్ళీ ఫైర్

రైతు చట్టాలకు నిరసనగా ఆందోళన చేస్తున్న అన్నదాతల విషయంలో ప్రధాని మోదీ సైలెంట్ గా ఉన్నారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. పాప్ స్టార్లంతా ఈ ఆందోళనపై మాట్లాడుతుంటే ఆయన మాత్రం స్పందించడం లేదని రాహుల్ అన్నారు. వ్యవసాయ చట్టాలకు నిరసనగా సోమవారం  కేరళ లోని తన పార్లమెంటరీ నియోజకవర్గమైన వయనాడ్ ని సందర్శించిన ఆయన ట్రాక్టర్ ర్యాలీలో పాల్గొన్నారు. తిరిక్కిపట్టయి నుంచి తుట్టిల్ అనే ప్రాంతం వరకు 6 కిలోమీటర్ల దూరం ఆయన ట్రాక్టర్ ను నడిపారు. హమ్ దో, హమారే దో అనే నినాదాన్ని తాను పార్లమెంటులో ప్రస్తావించానని, అంటే ప్రభుత్వం నుంచి ఇద్దరు, ప్రభుత్వం బయట నుంచి మరో ఇద్దరు అన్నఅర్థమేనన్నారు. ఈ నలుగురు భారత వ్యవసాయ రంగాన్ని నడిపిస్తున్నారని, రైతులు తమ ధాన్యాన్ని  తమకు అమ్మాలన్నదే వీరి లక్ష్యమని రాహుల్ పేర్కొన్నారు.

కేరళలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.కొత్త రైతు చట్టాలను పాలక యూడీఎఫ్, కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కూడా తీవ్రంగా విమర్శిస్తున్న విషయం గమనార్హం.

 

Also Read:

చనిపోయి ఇన్నేళ్లు అవుతున్నా ఆమె మరణం అంతుచిక్కని మిస్టరీనే.. దెయ్యమే చంపిందా..?.. షాకింగ్ వీడియో

Curfew: తెలంగాణలో ప్రస్తుతం కర్ఫ్యూ విధించే ఆలోచన లేదు: స్పష్టం చేసిన ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌