PM Modi: ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేదు.. ట్రంప్ త్వరగా కోలుకోవాలన్న అగ్రనేతలు

|

Jul 14, 2024 | 4:57 PM

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై జరిగిన దాడిని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఖండించారు. ట్రంప్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ట్రంప్‌పై జరిగిన దాడి పట్ల తాను ఆందోళన చెందుతున్నానని సోషల్ మీడియా వేదికగా ట్వీట్‌ చేశారు.

PM Modi: ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేదు.. ట్రంప్ త్వరగా కోలుకోవాలన్న అగ్రనేతలు
Pm Modi Donald Trump
Follow us on

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై జరిగిన దాడిని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఖండించారు. ట్రంప్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ట్రంప్‌పై జరిగిన దాడి పట్ల తాను ఆందోళన చెందుతున్నానని సోషల్ మీడియా వేదికగా ట్వీట్‌ చేశారు. రాజకీయాల్లో, ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేదన్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని అకాంక్షించారు. పెన్సిల్వేనియాలో ఎన్నికల ర్యాలీ సందర్భంగా డొనాల్డ్ ట్రంప్‌పై తుపాకీతో దాడి జరిగింది. ఈ దాడి నుంచి ట్రంప్‌ తృటిలో తప్పించుకున్నారు.

బుల్లెట్ ట్రంప్ చెవిని తాకింది. దాడి జరిగిన వెంటనే అతడిని భద్రతా సిబ్బంది ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ట్రంప్ ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఆయన క్షేమంగా ఉన్నారు. చికిత్స అనంతరం ఆయన ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. సీక్రెట్ సర్వీస్ వెంటనే దాడి చేసిన దుండగుడిని హతమార్చింది. దాడి అనంతరం ట్రంప్ మాట్లాడుతూ.. సకాలంలో స్పందించిన అమెరికా సీక్రెట్ సర్వీస్‌కు ట్రంప్ కృతజ్ఞతలు. ఇలాంటి ఘటన మన దేశంలో జరిగిందంటే నమ్మడం లేదన్నారు.

అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్‌పై జరిగిన దాడిని లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఖండించారు. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌పై హత్యాయత్నం జరగడం పట్ల తీవ్ర ఆందోళన చెందుతున్నానని ఆయన అన్నారు. ఇలాంటి చర్యలను తీవ్రంగా ఖండించాలన్న రాహుల్, త్వరగా, పూర్తిగా కోలుకోవాలని కోరుకుంటున్నాననన్నారు.

ఈ ఘటన తర్వాత అమెరికా వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. ట్రంప్‌పై దాడి తర్వాత, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తన సెలవులను రద్దు చేసుకున్నారు. అతను వైట్‌హౌస్‌కి తిరిగి వచ్చాడు. ట్రంప్ ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయిన తర్వాత, బైడెన్ అతని పరిస్థితిపై ఆరా తీశారు. బైడెన్ తోపాటు మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, బిల్ క్లింటన్ సహా పలువురు ప్రపంచ నేతలు ఈ దాడిని తీవ్రంగా ఖండించారు.

ఇదిలావుంటే, అమెరికా మాజీ అధ్యక్షుడు  ట్రంప్‌పై దాడి జరిగిన తర్వాత విజయావకాశాలు భారీగా పెరిగినట్లు పోల్స్టర్ల వెల్లడించింది. ట్రంప్ విజయానికి 70శాతం అవకాశాలున్నట్లు అంచనా వేసింది. గాయపడిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవడడంతో విజయావకాశాలు పెరిగాయని తెలిపింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…