PM Modi: ఉక్రెయిన్ అధ్యక్షుడికి ఫోన్ చేసి మాట్లాడిన ప్రధాని మోదీ

| Edited By: Ram Naramaneni

Mar 20, 2024 | 7:56 PM

రష్యా, ఉక్రెయిన్ మధ్య ఏడాదిన్నరగా యుద్ధం కొనసాగుతోంది. రెండు దేశాలు ఏమాత్రం తగ్గేలేదంటూ వార్‌ కంటిన్యూ చేస్తున్నాయి. అయితే.. ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు టెలిఫోన్‌లో మాట్లాడారు. వివిధ రంగాల్లో భారత్-ఉక్రెయిన్ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే మార్గాలపై ఇరువురు నేతలు చర్చించారు.

PM Modi: ఉక్రెయిన్ అధ్యక్షుడికి ఫోన్ చేసి మాట్లాడిన ప్రధాని మోదీ
Modi Spoke To Zelensky
Follow us on

రష్యా, ఉక్రెయిన్ మధ్య ఏడాదిన్నరగా యుద్ధం కొనసాగుతోంది. రెండు దేశాలు ఏమాత్రం తగ్గేలేదంటూ వార్‌ కంటిన్యూ చేస్తున్నాయి. అయితే.. ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు టెలిఫోన్‌లో మాట్లాడారు. వివిధ రంగాల్లో భారత్-ఉక్రెయిన్ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే మార్గాలపై ఇరువురు నేతలు చర్చించారు.

ఈ విషయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్విట్టర్‌ X వేదికగా వెల్లడించారు. “భారత్-ఉక్రెయిన్ భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడంపై అధ్యక్షుడు జెలెన్‌స్కీతో ఫలప్రదమైన చర్చలు జరిగాయన్నారు. శాంతి కోసం కొనసాగుతున్న సంఘర్షణకు ముందస్తు ముగింపు కోసం భారతదేశం నిరంతర మద్దతును తెలియజేశారు. భారతదేశం నిర్దేశించిన మానవతా సహాయం అందించడం కొనసాగిస్తుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

రెండు దేశాల మధ్య అన్ని సమస్యలను త్వరగా శాంతియుతంగా పరిష్కరించేందుకు భారత్ అన్ని ప్రయత్నాలకు మద్దతు ఇస్తుందని ప్రధాని అన్నారు శాంతియుత పరిష్కారానికి మద్దతివ్వడానికి భారతదేశం తన శక్తి మేరకు అన్నిటినీ కొనసాగిస్తుందని ఆయన అన్నారు. ఉక్రెయిన్ ప్రజల కోసం భారత్ మానవతా సహాయాన్ని అధ్యక్షుడు జెలెన్‌స్కీ ప్రశంసించారు. ఇద్దరు నేతలు టచ్‌లో ఉండేందుకు అంగీకరించారు.

అంతకుముందు, రష్యా అధ్యక్షుడిగా తిరిగి ఎన్నికైన వ్లాదిమిర్ పుతిన్‌కు ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. రష్యా ప్రజల శాంతి, పురోగతి, శ్రేయస్సు కోసం తన శుభాకాంక్షలు తెలిపారు. అదే సమయంలో, అంతర్జాతీయ ఎజెండాతో సహా అనేక అంశాలను పుతిన్‌తో ప్రధాని మోదీ చర్చించారు. దాంతోపాటు ఉక్రెయిన్ చుట్టూ ఉన్న ఉద్రిక్థ పరిస్థితుల సందర్భంలో ఇద్దరూ ప్రత్యేకంగా మాట్లాడారు. అంతేకాకుండా భారత్ – రష్యా మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి గట్టి ప్రయత్నాలు చేయాలని ప్రధాని మోదీ – పుతిన్ ఇద్దరూ అంగీకరించారు.

రష్యా-ఉక్రెయిన్ వివాదంలో చర్చల మార్గాన్ని అనుసరించాలని ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి పునరుద్ఘాటించారు. దీనితో పాటు, రష్యా-ఉక్రెయిన్ వివాదంలో సంభాషణ దౌత్యానికి అనుకూలంగా భారత్ వైఖరిని కూడా ప్రధాని స్పష్టం చేశారు. ద్వైపాక్షిక సహకారానికి సంబంధించిన వివిధ అంశాల్లో పురోగతిని కూడా ఇద్దరూ సమీక్షించారు. పరస్పర ఆసక్తి ఉన్న ప్రాంతీయ, ప్రపంచ సమస్యలపై అభిప్రాయాలను కూడా పంచుకున్నారు.అదే సమయంలో పుతిన్ కూడా రాబోయే పార్లమెంటు ఎన్నికలను విజయవంతంగా నిర్వహించాలని నరేంద్ర మోదీకి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ క్రమంలోనే రష్యా – ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న యుద్ధం మధ్య, రష్యా అధ్యక్షుడితో పాటు ఉక్రెయిన్‌ అధ్యక్షుడితో ఫోన్‌లో చర్చించారు ప్రధాని నరేంద్ర మోదీ.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…