AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi: స్వయం సహాయక సంఘాలకు ప్రధాని మోదీ శుభవార్త.. మహిళలకు మద్దతుగా ఈ-కామర్స్‌ వేదికలు

PM Modi: దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదివారం 75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కీలక ప్రకటన చేశారు. స్వయం సహాయక బృందాలు (ఎన్‌హెచ్‌జీ) తయారు చేసిన..

PM Modi: స్వయం సహాయక సంఘాలకు ప్రధాని మోదీ శుభవార్త.. మహిళలకు మద్దతుగా ఈ-కామర్స్‌ వేదికలు
Subhash Goud
|

Updated on: Aug 15, 2021 | 9:28 PM

Share

PM Modi: దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదివారం 75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కీలక ప్రకటన చేశారు. స్వయం సహాయక బృందాలు (ఎన్‌హెచ్‌జీ) తయారు చేసిన ఉత్పత్తులకు మార్కెట్‌ అందించడానికి ప్రభుత్వం ఇ-కామర్స్‌ ప్లాట్‌ఫామ్‌ను ఏర్పాటు చేస్తుందని వెల్లడించారు. గ్రామంలో 8 కోట్లకుపైగా మహిళలు స్వయం సహాయక సంఘాలతో సంబంధం కలిగి ఉన్నారని, వారు ఒకటి కంటే ఎక్కువ ఉత్పత్తులను తయారు చేస్తున్నారన్నారు. వారికి ప్రభుత్వం మద్దతుగా నిలుస్తుందని స్పష్టం చేశారు. ప్రభుత్వం ఇ-కామర్స్‌ ప్లాట్‌ఫామ్‌ను రూపొందిస్తుందన్నారు. దీని ద్వారా దేశ, విదేశాలలో పెద్ద మార్కె్‌ట్‌గా అవతరించేలా చేసుకోవచ్చని అన్నారు.

దేశం ‘వోకల్ ఫర్ లోకల్’ నినాదంతో ముందుకు సాగుతోందని ఆయన అన్నారు. దేశీయ ఉత్పత్తులను కొనుగోలు చేయడం మనందరి బాధ్యత. ప్లాస్టిక్ రహిత భారతదేశం కోసం మనం సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా ఆపివేస్తేనే నిజం అవుతుంది.. అని ప్రధాని అన్నారు. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి గురించి మాట్లాడుతూ.. ఈ రోజు గ్రామాలు వేగంగా అభివృద్ది చెందుతున్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా రోడ్డు, విద్యుత్ వంటి సౌకర్యాలు గ్రామాల చెంతకు చేరుతున్నాయి. నేడు ఆప్టికల్ ఫైబర్ నెట్ వర్క్ గ్రామాలకు సరికొత్త శక్తిని అందిస్తోంది అని అన్నారు. ఈ రోజు 75వ స్వాతంత్ర్యంలోకి అడుగు పెడుతున్నామని, ఇక్కడి నుంచి 100 సంవత్సరాల స్వాత్రంత్యం వరకు సాగే ప్రయాణం భారతదేశ సృష్టికి అమృతం అని అన్నారు. సబ్కా సాత్‌.. సబ్కా వికాస్‌, సబ్కా విశ్వాస్‌, సబ్కా ప్రయాస్‌తో ఈ లక్ష్యాన్ని సాధించాలని పిలుపునిచ్చారు.

ఇవీ కూడా చదవండి

Debit Card EMI: ఈ బ్యాంకు డెబిట్‌ కార్డుతో ఈఎంఐ ఆప్షన్‌.. క్రెడిట్‌ కార్డు ప్రయోజనాలన్నీ పొందవచ్చు..!

Mahatma Gandhi: భారత కరెన్సీ నోట్లపై మొదటి సారిగా మహాత్మగాంధీ చిత్రాన్ని ఎప్పుడు ముద్రించారు? ఆసక్తికర విషయాలు

Follow Us
రూపాయి నాణెం తయారీకి ఎంత ఖర్చువుతందంటే..? ప్రభుత్వ లెక్కలివే..
రూపాయి నాణెం తయారీకి ఎంత ఖర్చువుతందంటే..? ప్రభుత్వ లెక్కలివే..
రెడ్ రైస్ ప్రయోజనాలు తెలిస్తే ఇక తెల్లన్నం మానేస్తారు!
రెడ్ రైస్ ప్రయోజనాలు తెలిస్తే ఇక తెల్లన్నం మానేస్తారు!
ఈ స్కూల్ అమ్మాయిని గుర్తు పట్టారా? ఇప్పుడు టాలీవుడ్ హీరోయిన్
ఈ స్కూల్ అమ్మాయిని గుర్తు పట్టారా? ఇప్పుడు టాలీవుడ్ హీరోయిన్
ఉడికించిన గుడ్లు బయట పెడుతున్నారా? ఈ టైమ్ దాటితే తినకండి!
ఉడికించిన గుడ్లు బయట పెడుతున్నారా? ఈ టైమ్ దాటితే తినకండి!
Video: చీర కొంగును ఇంజిన్‌కు కట్టి .. ట్రైన్ ముందు మహిళ డ్యాన్స్!
Video: చీర కొంగును ఇంజిన్‌కు కట్టి .. ట్రైన్ ముందు మహిళ డ్యాన్స్!
ఉల్లిపాయ, టమాటాలు ఇంట్లో ఉన్నాయా?.. అదిరిపోయే చట్నీ రెసిపీ
ఉల్లిపాయ, టమాటాలు ఇంట్లో ఉన్నాయా?.. అదిరిపోయే చట్నీ రెసిపీ
ట్రైన్‌లోకి పాములతో ఎంట్రీ ఇచ్చిన ఆరుగురు వ్యక్తులు.. కట్‌చేస్తే.
ట్రైన్‌లోకి పాములతో ఎంట్రీ ఇచ్చిన ఆరుగురు వ్యక్తులు.. కట్‌చేస్తే.
వెండి వస్తువులపై నల్లటి పొర పోవాలంటే.. ఈ ట్రిక్ ట్రై చేయండి!
వెండి వస్తువులపై నల్లటి పొర పోవాలంటే.. ఈ ట్రిక్ ట్రై చేయండి!
బీపీ, కొలెస్ట్రాల్‌ సమస్యతో బాధపడుతున్నారా?
బీపీ, కొలెస్ట్రాల్‌ సమస్యతో బాధపడుతున్నారా?
నడవలేని స్థితిలో సీనియర్ నటి శారద.. ? ఫొటోస్ వైరల్
నడవలేని స్థితిలో సీనియర్ నటి శారద.. ? ఫొటోస్ వైరల్