‘నిప్పుతో చెలగాటమా ‘? నిర్భయ దోషుల లాయర్ పై జడ్జి ఫైర్

నిర్భయ దోషుల ఉరిపై స్టే విధించేందుకు ఢిల్లీలోని పటియాలా హౌస్  కోర్టు నిరాకరించింది. తమ ఉరిపై స్టే విధించాలన్న వీరి పిటిషన్ ను తిరస్కరించింది.

'నిప్పుతో చెలగాటమా '? నిర్భయ దోషుల లాయర్ పై జడ్జి ఫైర్
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Mar 02, 2020 | 5:19 PM

నిర్భయ దోషుల ఉరిపై స్టే విధించేందుకు ఢిల్లీలోని పటియాలా హౌస్  కోర్టు నిరాకరించింది. తమ ఉరిపై స్టే విధించాలన్న వీరి పిటిషన్ ను తిరస్కరించింది. ఈ దోషుల్లో ఒకడైన పవన్ గుప్తా తాజాగా దాఖలు చేసిన పిటిషన్ పై తన తీర్పును రిజర్వ్ లో ఉంచిన అదనపు సెషన్స్ జడ్జి ధర్మేందర్ రానా.. ఒక దశలో ఆగ్రహంతో.. అతని తరఫు లాయర్ వేసిన పిటిషన్ కాపీని చించి వేశారు. (తన మెర్సీ పిటిషన్ పెండింగులో ఉన్న కారణంగా రేపటి తన ఉరి శిక్షను నిలిపివేయాలని పవన్ కోరాడు.) అయితే వీరు నిప్పుతో చెలగాటమాడుతున్నారని, అత్యంత జాగ్రత్తగా ఉండాలని న్యాయమూర్తి రానా.. ఈ లాయర్ ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

ఎవరు ఒక తప్పు చేసినా పరిణామాలేమిటో మీకు తెలుసు అని ఆయన పేర్కొన్నారు. పవన్ వేసిన క్యురేటివ్ పిటిషన్ ను అత్యున్నత న్యాయస్థానం…  సుప్రీంకోర్టు ఈ ఉదయమే కొట్టివేసింది. దీంతో ఈ నలుగురు దోషులకు గల చట్టపరమైన మార్గాలన్నీ ముసుకుపోయాయి.  ఈ నలుగురూ కోర్టు సమయాన్ని వృధా చేస్తున్నారని, న్యాయ వ్యవస్థను దిగజారుస్తున్నారని నిర్భయ తల్లి ఆశాదేవి అన్నారు. మంగళవారం ఉదయం వీరి ఉరి ఖాయమన్న విశ్వాసాన్ని ఆమె వ్యక్తం చేశారు.