‘గ్యాస్ చాంబర్‌’గా ఢిల్లీ.. రాజధాని వాసుల్లో టెన్షన్

దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకుంది. గాలిలో నాణ్యతా ప్రమాణాలు ప్రమాదకర స్థితికి దిగజారగా.. శుక్రవారం ఏక్యూఐ(గాలి నాణ్యతా సూచీ) రికార్డు స్థాయిలో 599కు చేరుకోవడంతో హెల్త్ ఎమర్జెన్సీని విధించారు. సుప్రీంకోర్టు నియమించిన నిపుణుల కమిటీ, పర్యావరణ కాలుష్య నియంత్రణ సంస్థ శుక్రవారం ఈ నిర్ణయం తీసుకున్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఈ నెల ఐదో తేదీ వరకు స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. అలాగే కాలుష్య నియంత్రణకు చర్యలు […]

'గ్యాస్ చాంబర్‌'గా ఢిల్లీ.. రాజధాని వాసుల్లో టెన్షన్
Follow us

| Edited By:

Updated on: Nov 02, 2019 | 9:01 AM

దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకుంది. గాలిలో నాణ్యతా ప్రమాణాలు ప్రమాదకర స్థితికి దిగజారగా.. శుక్రవారం ఏక్యూఐ(గాలి నాణ్యతా సూచీ) రికార్డు స్థాయిలో 599కు చేరుకోవడంతో హెల్త్ ఎమర్జెన్సీని విధించారు. సుప్రీంకోర్టు నియమించిన నిపుణుల కమిటీ, పర్యావరణ కాలుష్య నియంత్రణ సంస్థ శుక్రవారం ఈ నిర్ణయం తీసుకున్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఈ నెల ఐదో తేదీ వరకు స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. అలాగే కాలుష్య నియంత్రణకు చర్యలు తీసుకోవాలని కోరుతూ ఉత్తరప్రదేశ్, హర్యానా, ఢిల్లీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు ఆయన లేఖలు రాశారు.

కాగా గతేడాది జనవరి తర్వాత గాలిలో నాణ్యతా ప్రమాణాలు ఈ స్థాయికి పడిపోవడం ఇదే తొలిసారి. ఢిల్లీ చుట్టుపక్కల రాష్ట్రాల్లో పంటల వ్యర్థాలను కాల్చడం, దీపావళి సమయంలో బాణసంచా పేలుళ్లు, పరిశ్రమలు, వాహన కాలుష్యాలతో రాజధాని ఓ గ్యాస్ చాంబర్‌లా మారిపోయింది. ఇదిలా ఉంటే ఢిల్లీ ప్రభుత్వం మొత్తంగా 50లక్షల మాస్క్‌లను పంపిణీ చేస్తోంది. మాస్క్ లేకుండా బయటకు రావొద్దని ఢిల్లీ వాసులను కేజ్రీవాల్ కోరారు. మరోవైపు ఢిల్లీలో కాలుష్యాన్ని అదుపులోకి తెచ్చేందుకు కేజ్రీ ప్రభుత్వం చర్యలు తీసుకొంటోంది. వచ్చే 48 గంటల్లో ‘ఏక్యూఐ’ మరింత ప్రమాదకర స్థాయికి పడిపోతే.. కార్ల ప్రయాణికులకు ‘సరి-బేసి’  విధానాన్ని అమలులోకి తీసుకురాబోతోంది. సీఎం కేజ్రీవాల్‌ అభ్యర్థన మేరకు సోమవారం నుంచి ఢిల్లీలో ‘సరి-బేసి’ విధానం అమలుకు రంగం సిద్ధమైంది. సరి- బేసి రేషనింగ్‌తో వాయు కాలుష్యం తగ్గుతుందని, ఈ నెల 15 వరకు ఈ విధానం కొనసాగిస్తామని ప్రభుత్వం తెలిపింది. కాగా రోజురోజుకు పెరుగుతోన్న కాలుష్యంతో రాజధాని వాసుల్లోనూ టెన్షన్ నెలకొంది. పలు ముందస్తు జాగ్రత్తలు తీసుకొని బయటకు వెళ్తున్నారు.