తిరుపతిలో జాన్వీ కపూర్ పెళ్లి.. క్రేజీ రిప్లే ఇచ్చిన బ్యూటీ

Rajeev 

08 May 2024

బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ఇప్పుడు తెలుగులోకి ఎంట్రీ ఇస్తుంది. దేవర సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది.

ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న దేవర సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమాతో పాటు మరో సినిమా కూడా చేస్తుంది జాన్వీ.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు డైరెక్షన్ లో వస్తున్న సినిమాలో జాన్వీ నటిస్తుందని తెలుస్తోంది.

ఇదిలా ఉంటే శిఖర్ పహారియాను జాన్వీ కపూర్ వివాహం చేసుకోనున్నారంటూ ఓ రూమర్ చక్కర్లు కొడుతోంది.

శిఖర్ పహారియాను జాన్వీ కపూర్ ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. చాలా సార్లు ఈఇద్దరూ మీడియా కంట పడ్డారు.

మొన్నామధ్య తిరుపతి కూడా వచ్చారు. త్వరలోనే ఈ ఇద్దరూ మెప్పి చేసుకోబోతున్నారంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

తిరుపతిలో వీరి పెళ్లి జరగనుందని ఇన్‍స్టాగ్రామ్‍లో ఓ ఫొటో పోస్ట్ వైరల్ అయింది. దీనికి జాన్వీ కపూర్ స్పందించింది

‘కుచ్ బీ’ అంటూ ఆ పోస్ట్‌కు జాన్వీ కామెంట్ చేసేశారు. ఇప్పుడు ఈ కామెంట్ వైరల్ గా మారింది.