Haryana: హర్యానా ముఖ్యమంత్రి ఖరారు అయ్యిందా.. ? అధిష్టానం ఎవరివైపు..?

|

Oct 09, 2024 | 9:22 AM

హర్యానా స్వభావం గుజరాత్‌కు భిన్నంగా ఉంటుందని, అందుకే నైబ్ సింగ్ సైనీ ఆరు నెలల పాటు ఇక్కడ సీఎంగా ఉంటారని రాజకీయ పండితులు విశ్వసించారు. పోలింగ్ తర్వాత, ఒపీనియన్ పోల్ కూడా ఈ ఊహాగానాన్ని ధృవీకరించింది. ఇక ఫలితాలు అందుకు భిన్నం..

Haryana: హర్యానా ముఖ్యమంత్రి  ఖరారు అయ్యిందా.. ? అధిష్టానం ఎవరివైపు..?
Nayab Singh Saini
Follow us on

లోక్‌సభ ఎన్నికలకు ముందు హర్యానా ముఖ్యమంత్రిగా నయాబ్ సింగ్ సైనీని నియమించినప్పుడు, రాకీయ నిపుణులందరూ ఈ ప్రయోగం విఫలమైనట్లు ప్రకటించారు. గుజరాత్‌లోని పలు రాష్ట్రాల్లో ఎన్నికలకు ముందు సీఎంను మార్చడం ద్వారా అధికార వ్యతిరేక ప్రభావాన్ని తగ్గించే ట్రిక్కు బీజేపీ ప్రయత్నించింది. హర్యానా స్వభావం గుజరాత్‌కు భిన్నంగా ఉంటుందని, అందుకే నైబ్ సింగ్ సైనీ ఆరు నెలల పాటు ఇక్కడ సీఎంగా ఉంటారని రాజకీయ పండితులు విశ్వసించారు. పోలింగ్ తర్వాత, ఒపీనియన్ పోల్ కూడా ఈ ఊహాగానాన్ని ధృవీకరించింది. ఇందులో కాంగ్రెస్‌కు 55-60 సీట్లు వస్తాయని అంచనా వేశారు. ఈ ఊహాగానాలన్నింటికీ అక్టోబరు 8న ఫలితాలు తెరదించాయి. 2019లో కంటే ఎక్కువ స్థానాల్లో బీజేపీ గెలుపొందింది. ఈ ఫలితంతో నాయబ్ సింగ్ సైనీ భవితవ్యం తేలిపోయింది.

2024 హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు ముందు, నైబ్ సింగ్ సైనీ, ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ, అండర్ డాక్‌గా కనిపించారు. ఆయన ఇమేజ్ మాజీ ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌కు దగ్గరగా ఉంది. హర్యానా అసెంబ్లీ ఎన్నికలు ప్రకటించినప్పుడు, రాజకీయ పండితులు సహా చాలా మంది విశ్లేషకులు హర్యానా నుండి బీజేపీ నిష్క్రమణ ఖాయంగా భావించారు. అధికార వ్యతిరేకత, మల్లయోధులు, రైతులు, సైనికుల సమస్యలపై కాంగ్రెస్ దూకుడుగా ప్రచారం నిర్వహించింది. రాహుల్ గాంధీతో పాటు ప్రియాంక గాంధీ, భూపేంద్ర హుడా, దీపేంద్ర హుడా హర్యానాలో నయాబ్ సింగ్ సైనీ ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. పోలింగ్ తర్వాత, ఎగ్జిట్ పోల్‌లో బీజేపీకి 25-28 సీట్లు మాత్రమే ఇచ్చారు. దీని తర్వాత కూడా సైనీ తన నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. ఎన్నికల్లో బీజేపీకి పూర్తి మెజారిటీ వచ్చింది. ఈ విజయం నాయబ్‌ సింగ్‌ ఇమేజ్‌ని మార్చేయడం ఖాయంగా కనిపిస్తోంది.

హర్యానాలో కూడా బీజేపీ గుజరాత్ మత్రాన్నే పాటించింది. హర్యానా నుంచి మనోహర్ లాల్ ఖట్టర్‌ను కేంద్రానికి తీసుకెళ్లారు. నాయబ్ సింగ్ సైనీని ఓబీసీ అభ్యర్థిగా సీఎం చేశారు. సీఎం అయిన వెంటనే సైనీ ప్రజాకర్షక పథకాలకు ఖజానాను తెరిచారు. హర్యానాలో కూడా 16 మంది ఎమ్మెల్యేల టిక్కెట్లు నిరాకరించింది అధిష్టానం. ఇప్పుడు ఫలితం వెలువడింది.

ఈ నేపథ్యంలో హర్యానా సిట్టింగ్ ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీకి మరోసారి అత్యున్నత పదవి దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఆయన సమర్థతవంతమైన రాజనీతి కారణంగా ఊహాగానాలకు ముగింపు పలికారని బీజేపీ నాయకులు అంటున్నారు. రాష్ట్రంలో 90 అసెంబ్లీ స్థానాలకు గాను 49 స్థానాల్లో బీజేపీ విజయం సాధించి, చారిత్రాత్మకంగా మూడోసారి అధికారంలోకి రావడం ఖాయంగా కనిపిస్తోంది. కాంగ్రెస్ 36 స్థానాలకే పరిమితమైంది. సైనీ విజయం సాధిస్తే, మరోసారి ముఖ్యమంత్రిగా కొనసాగుతారని ఎన్నికలకు ముందే బీజేపీ నాయకత్వం స్పష్టం చేసినప్పటికీ, అతని పనితీరు, కుల కోణం దృష్ట్యా మార్పుపై ఊహాగానాలు వచ్చాయి. సైనీ ఇతర వెనుకబడిన తరగతులకు చెందిన వ్యక్తి కావడం, అదే సమయంలో రాష్ట్రంలో జాట్‌లు అత్యున్నత పదవి నుండి నాయకత్వం వహిస్తుండటం సీఎం మార్పు ఉండవచ్చని భావించారు.

ఎన్నికలకు దాదాపు 200 రోజుల ముందు సైనీని ముఖ్యమంత్రి పదవికి ఎంపిక చేశారు. అందులో భాగంగానే అధికార వ్యతిరేకత ఉన్న రాష్ట్రాల్లో బీజేపీ చేపట్టే వ్యూహాత్మక ఎన్నికలకు ముందు పునర్వ్యవస్థీకరణ మంచి ఫలితాన్ని రాబట్టిందనే చెప్పవచ్చు. అంతేకాకుండా సైనీకి మాజీ సీఎం, ప్రస్తుత కేంద్ర మంత్రి ఖట్టర్ మద్దతు ఉండటంతో మార్పు సాఫీగా కనిపించిందనే చెప్పాలి. సైనీ తన అతి తక్కువ హయాంలో వ్యాపారులు, యువకులు, వెనుకబడిన తరగతులు, ప్రభుత్వ ఉద్యోగులకు ప్రయోజనం చేకూర్చేందుకు ఉద్దేశించిన అనేక పథకాలను అమలు చేయగలిగారు. ఖట్టర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సంవత్సరాలుగా పేరుకుపోయిన అధికార వ్యతిరేకతను తిప్పికొట్టారని బీజేపీ నాయకులు చెప్పారు. అగ్నివీర్‌లకు ఉపాధి, వ్యవస్థాపక అవకాశాలను అందించడానికి, అగ్నివీర్ పథకంపై ఎదురుదెబ్బలను ఎదుర్కోవడానికి రాష్ట్ర హర్యానా అగ్నివీర్ పాలసీ, 2024ను ప్రారంభించారు. నిరుపేద ప్రజలకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచిత వైద్య పరీక్షలు అందించడంతోపాటు విద్యుత్తుపై కనీస చార్జీలను రద్దు చేశారు.

ఇది కూడా తన సాంప్రదాయ జాట్-యేతర ఓటర్ల స్థావరాన్ని ఏకీకృతం చేసుకునేందుకు బీజేపీ వ్యూహంలో భాగం. జాట్ ఓట్లు కాంగ్రెస్, జాట్ పార్టీలైన ఐఎన్‌ఎల్‌డి, జననాయక్ జనతా పార్టీల మధ్య చీలిపోతాయని ఊహించారు. జాట్‌ల ప్రాబల్యం ఉన్న సీట్లలో 70 శాతం ఆధిక్యంలో ఉంది. మొత్తం 33 స్థానాలో బీజేపీ 17, కాంగ్రెస్ 14 స్థానాల్లో మాత్రమే ముందంజలో ఉంది. మొత్తం ఏడు బెల్‌వెదర్ స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. షెడ్యూల్డ్ కులాల ఆధిపత్యం ఉన్న సీట్లలో కూడా బీజేపీ ఆధిక్యత సాధించగలిగింది.

ఈ నేపథ్యంలోనే హర్యానా ముఖ్యమంత్రిగా మరోసారి నయాబ్ సింగ్ సైనీ వైపు బీజేపీ అధిష్టానం మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. అయితే పార్టీలో మరికొందరు పోటీదారులు కనిపిస్తున్నారు. రాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్‌ విజ్‌, కేంద్ర మంత్రి రావు ఇంద్రజిత్‌ సింగ్‌ సీఎం పదవిపై అశలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..