National Herald Case: మరింత ముదురుతున్న నేషనల్‌ హెరాల్డ్‌ కేసు.. మరోసారి ఈడీ ముందుకు సోనియాగాంధీ

National Herald Case: నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ మూడోసారి విచారించనుంది. నిన్న విచారించిన ఈడీ పలు ప్రశ్నలను..

National Herald Case: మరింత ముదురుతున్న నేషనల్‌ హెరాల్డ్‌ కేసు.. మరోసారి ఈడీ ముందుకు సోనియాగాంధీ
National Herald Case
Follow us

|

Updated on: Jul 27, 2022 | 7:44 AM

National Herald Case: నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ మూడోసారి విచారించనుంది. నిన్న విచారించిన ఈడీ పలు ప్రశ్నలను సంధించింది. దీంతో కాంగ్రెస్‌ నేతలు పెద్ద ఎత్తున నిరసనలకు దిగుతున్నారు. ఈ రోజు కూడా ఈడీ ముందు హాజరు కావాలని తెలుపడంతో కాంగ్రెస్‌ కార్యకర్తలు ఢిల్లీలో హంగామా సృష్టించనున్నారు.

ఈ నేషనల్ హెరాల్డ్ కేసులో మంగళవారం సోనియా గాంధీని ఈడీ రెండోసారి ప్రశ్నించింది. సోనియాను ఈడీ పలు ప్రశ్నలు అడిగినట్లు సమాచారం. యంగ్ ఇండియన్ గురించి మీరు ఎన్ని సమావేశాలకు హాజరయ్యారు..? ఏజేఎల్‌కు కాంగ్రెస్‌ రుణం ఇస్తే బ్యాలెన్స్‌ షీట్‌లో ఎందుకు చూపలేదని ఈడీ ప్రశ్నించింది.ఈ విషయంలో రాహుల్‌ గాంధీ లబ్దిపొందలేదా అంటూ ప్రశ్నల వర్షం కురిపించింది ఈడీ. దీంతో కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసనలు కొనసాగిస్తున్నారు. నిన్న పార్లమెంట్‌ ఎదుట బైఠాయించడంతో పోలీసులు అడ్డుకున్నారు. రాహుల్‌గాంధీతో పాటు, పలువురు ఎంపీలను సైతం అరెస్టు చేశారు పోలీసులు. ఈ రోజు కూడా సోనియా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ముందుకు హాజరు అవుతుండటంతో కాంగ్రెస్‌ నేతలు మరోసారి ఆందోళనలు చేసేందుకు సిద్ధమవుతున్నారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి
Latest Articles