Monkeypox: మంకీపాక్స్‌కు కోతులతో ఉన్న సంబంధం ఏమిటి..? ఈ వ్యాధి వాటిద్వారానే వ్యాపిస్తుందా?

ఇప్పటివరకు ఆఫ్రికన్, యూరోపియన్ దేశాల్లో హడలెత్తించిన మంకీపాక్స్‌ ఇప్పుడు భారత్‌లో కూడా అలజడి రేపింది. తాజాగా.. మంకీపాక్స్‌ కేసు నమోదవ్వడం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. అయితే.. మంకీపాక్స్ వైరస్.. సాధారణంగా అందరూ మంకీ (కోతులు) అని పేరు ఉండటంతో కోతుల ద్వారా వ్యాపిస్తుందని అనుకుంటారు.. కానీ..

Monkeypox: మంకీపాక్స్‌కు కోతులతో ఉన్న సంబంధం ఏమిటి..? ఈ వ్యాధి వాటిద్వారానే వ్యాపిస్తుందా?
Mpox
Follow us

| Edited By: Janardhan Veluru

Updated on: Sep 09, 2024 | 7:02 PM

ప్రపంచాన్ని పట్టిపీడించిన కరోనా వైరస్ ఇప్పుడిప్పుడే కనుమరుగవుతోంది.. దాదాపు నాలుగేళ్ల తర్వాత కేసుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది.. ఈ క్రమంలోనే మరో మహమ్మారి మంకీపాక్స్‌ టెన్షన్‌ పుట్టిస్తోంది. దాదాపు వంద దేశాలకు ఈ మహమ్మారి విస్తరించింది.. ఇప్పటివరకు ఆఫ్రికన్, యూరోపియన్ దేశాల్లో హడలెత్తించిన మంకీపాక్స్‌ ఇప్పుడు భారత్‌లో కూడా అలజడి రేపింది. తాజాగా.. మంకీపాక్స్‌ కేసు నమోదవ్వడం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. మరోకరికి మంకీపాక్స్ లక్షణాలు ఉన్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. అయితే.. మంకీపాక్స్ మహమ్మారి తీవ్రతను ఎదుర్కొంటున్న దేశం నుంచి ఇటీవలే భారత్ కు వచ్చిన ఒక యువకుడికి మంకీపాక్స్ వైరస్ పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లు ప్రభుత్వం సోమవవారం వెల్లడించింది. ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌ లో Mpox అనుమానిత కేసుగా గుర్తించిన అధికారులు.. ఐసోలేషన్ కు తరలించారు. రోగి నుంచి రక్త నమూనాలను సేకరించి ఎంపాక్స్‌ నిర్ధారణ కోసం ల్యాబ్ కు పంపించగా.. పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లు ప్రభుత్వం తెలిపింది. యువకుడి పరిస్థితి నిలకడగా ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ వ్యాధి తీవ్రతపై జాతీయ వ్యాధుల నియంత్రణ కేంద్రం ముందస్తుగానే అంచనాలు వేసిందని ఆందోళన చెందాల్సి అవసరం లేదని పేర్కొంది. ఇప్పటివరకు ఒకటే కేసు నమోదైందని పేర్కొంది. అంతకుముందు జూలై 2022 నుంచి భారతదేశంలో 30 కేసులు నమోదయ్యాయని.. వాటి మాదిరిగానే ఇదికూడా ఒకటని పేర్కొంది. WHO ప్రకారం.. mpox క్లాడ్ 1 హెల్త్ ఎమర్జెన్సీకి సంబంధించినది కాదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వివరించింది.

అయితే.. ప్రాణాంతక ఎంపాక్స్‌ వ్యాప్తి ఆఫ్రికా దేశాల్లో ఆందోళనకర రీతిలో ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంటోంది. ఇప్పటికే 18 వేల అనుమానిత కేసులు, 926 మరణాలు సంభవించాయని నివేదికలు చెబుతున్నాయి.. కొత్తరకం కేసులు ఇప్పటివరకు 258 నమోదైనట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది.

మంకీపాక్స్ కేసు నమోదు కావడంతో భారత్‌ కూడా అప్రమత్తమైంది. ఎయిర్‌పోర్టులు, రేవుల ద్వారా దేశంలోకి ప్రవేశించే వారిని క్షుణ్ణంగా పరిశీలించాలని ప్రభుత్వం అధికారులకు ఆదేశాలిచ్చింది.. అలాగే మంకీపాక్స్‌ వైరస్‌ను గుర్తించేందుకు వీలుగా దేశంలో 32 ప్రత్యేక లాబ్స్‌ ను ఇప్పటికే ఏర్పాటు చేసింది. అంతేకాకుండా ఢిల్లీ లాంటి ప్రదేశాల్లో ప్రత్యేక వార్డులను కూడా ఏర్పాటు చేసింది. అత్యవసర పరిస్థితులను సైతం ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది..

కోతుల ద్వారానే మంకీ పాక్స్ వ్యాపిస్తుందా..?

అయితే.. మంకీపాక్స్ వైరస్.. సాధారణంగా అందరూ మంకీ (కోతులు) అని పేరు ఉండటంతో కోతుల ద్వారా వ్యాపిస్తుందని అనుకుంటారు.. కానీ.. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, కోతుల ద్వారా వైరస్ వ్యాప్తి చెందడం అనేది 100% అబద్దం.. అప్పుడు ఈ వ్యాధికి కోతుల (మంకీ పాక్స్) అని పేరు ఎందుకు పెట్టారు..? ఎలా పెట్టారు అనే ప్రశ్న తలెత్తుతుంది.

అమెరికన్ హెల్త్ ఏజెన్సీ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) నివేదిక ప్రకారం.. ఈ వ్యాధిని ఇంతకుముందు మంకీపాక్స్ అని పిలిచేవారు. కానీ తరువాత దీనికి Mpox అని పేరు పెట్టారు. అయితే సాధారణ పరిభాషలో కూడా దీనిని mpox అని కాకుండా మంకీపాక్స్ అని పిలుస్తారు.

Monkeypox

Monkeypox

జంతువుల ద్వారా..

Mpox అనేది జూనోటిక్ వ్యాధి.. అంటే ఇది జంతువులు, మానవుల మధ్య వ్యాపిస్తుంది. దీని మొదటి కేసు 1958లో వెలుగులోకి వచ్చింది. ఈ వైరస్ ను కోతులలో కనుగొన్నారు. అందుకే.. ఈ వ్యాధికి మంకీపాక్స్ అని పేరు పెట్టారు.. ఈ పేరు పెట్టడానికి కారణం ఇదే.. అయినప్పటికీ ఈ వైరస్ ఎక్కడ నుంచి వచ్చిందో ఇప్పటివరకు తెలియదు..

ఆఫ్రికన్ క్షీరదాలు (ఎలుకలు, ఉడుతలు వంటి జీవులు).. మానవేతర జంతువులు (కోతుల వంటివి) ఈ వైరస్‌కు నిలయంగా ఉన్నాయని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. వీటి ద్వారా ఇన్ఫెక్షన్ వ్యాపిస్తుంది. అయితే.. మానవులలో మంకీపాక్స్ మొదటి కేసు 1970లో నమోదైంది.. రోగి డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో నివాసి..

2022 సంవత్సరంలో Mpox ప్రపంచవ్యాప్తంగా వ్యాపించింది. దీనికి ముందు, ఇతర ప్రదేశాలలో mpox కేసులు చాలా అరుదుగా నమోదయ్యేవి.. సాధారణంగా mpox ప్రబలిన ప్రాంతాల నుంచి ప్రయాణం చేసిన మనుషులు లేదా జంతువులతో సంబంధం కలిగి ఉంటాయి. అక్కడి నుంచి వెళ్లిన లేదా.. ప్రయాణం చేసిన వారి నుంచి ఈ వ్యాధి ప్రబలినట్లు నివేదికలు ఉన్నాయి.

మంకీపాక్స్ వైరస్ ఎలా వ్యాపిస్తుంది?

CDC నివేదిక ప్రకారం.. మంకీపాక్స్ వైరస్ సోకిన రోగి లాలాజలం, చెమట, సోకిన వస్తువుల ద్వారా ఆరోగ్యకరమైన వ్యక్తికి వ్యాపిస్తుంది. ఈ వైరస్ సోకిన గర్భిణీ స్త్రీ నుంచి ఆమె బిడ్డకు కూడా సంక్రమిస్తుంది. మంకీపాక్స్ వైరస్ సోకిన వారి వస్త్రాలు లేదా ఉపరితలాన్ని తాకిన తర్వాత కూడా సాధారణ వ్యక్తిని అనారోగ్యానికి గురి చేస్తుందంటే.. ఇది ఎంత ప్రమాదకరమో అర్ధం చేసుకోవచ్చు..

ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి..

వ్యాధి సోకిన రోగిలో లక్షణాలు కనిపించడానికి 1 నుంచి 4 రోజులు పట్టే అవకాశం ఉంది.. తలనొప్పి, జ్వరం, కండరాల నొప్పి, చలి, దద్దుర్లు, శోషరస గ్రంథులు వాపు (గొంతు వాపు) వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొన్ని సందర్భాల్లో, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఆహారం మింగడంలో ఇబ్బంది, కళ్ళ వాపు, వెన్నపూస నొప్పి లాంటివి ఉండవచ్చు.

అయితే, ఇప్పటి వరకు అలాంటి కేసులు వెలుగులోకి రాలేదు.. ఇందులో ఒక వ్యక్తికి కూడా ఇలాంటి తీవ్రమైన లక్షణాలను నిర్ధారించలేదు.. ఇంకా ఇలాంటి వారి నుంచి ఇతరులకు వ్యాపించినట్లు నివేదికలు లేవు.. అయితే.. ఇది జంతువుల నుంచి మనుషులకు వ్యాపిస్తుందనేది ముమ్మాటికి నిజం.. ఆఫ్రికన్ దేశాల్లో ఇలాంటి అనేక కేసులు నమోదయ్యాయి.

Monkeypox

Monkeypox

WHO ఏమని చెప్పిందంటే?

ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ఆఫ్రికన్ దేశాలలో ఇలాంటి కేసులు చాలా నమోదయ్యాయని, అయితే వాటి వ్యాప్తికి కారణం కనుగొనబడలేదని తెలిపింది.. వివిధ దేశాల ప్రభుత్వాలు అత్యవసర ప్రతిస్పందన ద్వారా లక్షణాలు కనిపించిన వారిపై నిఘా ఉంచాయి. అయితే, ఈ వ్యాధి గురించి ప్రజల్లో అవగాహన లేకపోవడంతో, దాని కేసులు వ్యాపించి, వెలుగులోకి వచ్చిన అనేక దేశాలు ఉన్నాయి. ఆ దేశాల్లో, దానిని పరీక్షించే, గుర్తించే వ్యవస్థ, సంరక్షణ నిపుణుల సంఖ్యను పరిమితం చేశారు. ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే మంకీపాక్స్ వైరస్ నియంత్రణకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది. ఈ వైరస్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని, ఆస్పత్రుల్లో తగిన మౌలిక సదుపాయాలు రెడీ చేసుకోవాలని దేశాలను హెచ్చరించింది. మంకీపాక్స్‌ కేసులు పెరుగుతున్న దృష్ట్యా ప్రపంచ ఆరోగ్య సంస్థ హెల్త్‌ ఎమర్జెన్సీగా ప్రకటించింది.

మరిన్ని ప్రీమియం కథనాల కోసం.. TV9 News యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి