48 వేల ఏళ్ల నాటి డేంజరస్ వైరస్.. కరోనాను మించిన విలయం తప్పదా?
09 September 2024
Battula Prudvi
వేల ఏళ్లుగా మంచులో కప్పబడిన ఈ వైరస్‌లు.. ఇప్పుడు బయటకు వస్తున్నాయన్న అంచనాతో ఒక్కసారిగా ప్రజలు ఉలిక్కిపడుతున్నారు.
కరోనా వైరస్ సృష్టించిన విలయతాండవం నుంచి ఇప్పటికి చాలమంది బయటికిరాలేకపోతున్నారు. చాలామంది ఆత్మీయులను కోల్పోయారు.
దీన్ని మించిన ప్రమాదకరమైన వైరస్‌లు మనుషులపైకి దండయాత్ర చేసేందుకు వస్తున్నాయన్న విషయం తెలిసి బెంబేలెత్తిపోతున్నారు.
గ్లోబల్ వార్మింగ్ కారణంగా ఆర్కిటిక్‌లోని మంచు వేగంగా కరిగిపోతుందని ప్రపంచవ్యాప్తంగా పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రష్యాలోని సైబీరియన్ ప్రాంతంలో కరుగుతున్న మంచు నమూనాలను పరిశీలించిన సైంటిస్టులు.. 13 కొత్త తరహా వైరస్‌లను 2022లో గుర్తించారు.
వీటిపై తాజాగా పరిశోధనలు జరిపిన సైంటిస్టులు.. వీటిలో 48,500 ఏళ్ల క్రితం గడ్డకట్టుకుపోయిన జాంబీ తరహా వైరస్‌లు ఇంకా సజీవంగానే ఉన్నాయని తెలిపారు.
ఈ జాంబీ తరహా వైరస్‌లు తొందరలోనే ఉనికిలోకి వచ్చే అవకాశం ఉందని అంచనా వేశారు వీటిని పరిశీలించిన సైంటిస్టులు.
ఈ వైరస్‌ల కారణంగా ఎటువంటి నష్టం జరుగుతుందనే విషయం స్పష్టంగా తెలియనప్పటికీ.. మానవాళి మనుగడకే ప్రమాదం ఉంటుందని మాత్రం హెచ్చరిస్తున్నారు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి