Shivraj Singh Chouhan: రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము.. సంతోషంతో గిరిజనులతో డ్యాన్స్‌ చేసిన సీఎం.. నెట్టింట వైరల్‌ వీడియో..

|

Jun 24, 2022 | 10:02 AM

Presidential Elections 2022: దేశ రాజధాని ఢిల్లీలో రాష్ట్రపతి ఎన్నికల సందడి వాతారణం నెలకొంది. మరికొద్ది సేపట్లో ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము (Droupadi Murmu) నామినేషన్‌ వేయనున్నారు.

Shivraj Singh Chouhan: రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము.. సంతోషంతో గిరిజనులతో డ్యాన్స్‌ చేసిన సీఎం.. నెట్టింట వైరల్‌ వీడియో..
Shivraj Singh Chouhan
Follow us on

Presidential Elections 2022: దేశ రాజధాని ఢిల్లీలో రాష్ట్రపతి ఎన్నికల సందడి వాతారణం నెలకొంది. మరికొద్ది సేపట్లో ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము (Droupadi Murmu) నామినేషన్‌ వేయనున్నారు. కాగా ఓ గిరిజన మహిళను రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేయడంపై సర్వత్రా హర్షవ్యక్తమవుతోంది. పలువురు ప్రముఖులు ఈ నిర్ణయాన్ని సమర్థిస్తున్నారు. ఈక్రమంలో ద్రౌపది ముర్ము ఎంపికను పురస్కరించుకుని మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ (Shivraj Singh Chouhan) గిరిజనులు, బీజేపీ నేతలతో కలిసి డాన్స్ చేశారు. గిరిజనుల తరహాలోనే దుస్తులు ధరించి, చేతుల్లో నెమలి ఈకలు, విల్లు పట్టుకని గిరిజన మహిళలతో ఉత్సాహంగా కాలు కదిపారు. ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము ఎంపిక చేసి బీజేపీ చాలా గొప్ప నిర్ణయం తీసుకుంది, ఇదుకు తాను చాలా సంతోషిస్తున్నట్లు సీఎం చౌహాన్ ట్విట్టర్‌ వేదికగా ఈ వీడియోను పంచుకున్నారు. దీంతో ఇది కాస్తా నెట్టింట్లో వైరల్‌గా మారింది.

కాగా ద్రౌపది ముర్ము మరికొద్ది సేపట్లో నామినేషన్‌ వేయనున్నారు. ప్రధాని మోడీ సహా కేంద్ర మంత్రులు, ఇతర రాష్ట్రాల ముఖ్య నేతలు ఈ ఈ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనున్నారు. ఇక విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా జూన్‌ 27న నామినేషన్ దాఖలు చేయనున్నారు. జూలై 18న రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్‌, 21న కౌంటింగ్‌ జరుగుతుంది. నామినేషన్లు జూన్ 29వ తేదీలోగా సమర్పించాల్సి ఉంటుంది. జులై 21 లోగా ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఇక ప్రస్తుత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పదవీ కాలం జులై 24వ తేదీతో ముగియనుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..