దండకారణ్యంలో బయటపడ్డ భారీ సొరంగాలు.. లోపలికెళ్లి చూడగా మైండ్ బ్లాంక్.!

| Edited By: Ravi Kiran

Jan 31, 2024 | 9:30 PM

ఛతీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లా బీజాపూర్ సరిహద్దు అటవీ ప్రాంతంలో మంగళవారం ఎన్‌కౌంటర్ జరిగింది. మావోయిస్టులు, భద్రతా బలగాలు మధ్య ఎదురు కాల్పుల్లో ముగ్గురు జవాన్లు మృతి చెందారు. మరో 15 మంది జవాన్లు గాయపడ్డారు. గాయపడిన వారిని హెలికాప్టర్ ద్వారా జగదల్‌పూర్ ఆసుపత్రికి తరలించారు.

దండకారణ్యంలో బయటపడ్డ భారీ సొరంగాలు.. లోపలికెళ్లి చూడగా మైండ్ బ్లాంక్.!
Representative Image
Follow us on

ఛతీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లా బీజాపూర్ సరిహద్దు అటవీ ప్రాంతంలో మంగళవారం ఎన్‌కౌంటర్ జరిగింది. మావోయిస్టులు, భద్రతా బలగాలు మధ్య ఎదురు కాల్పుల్లో ముగ్గురు జవాన్లు మృతి చెందారు. మరో 15 మంది జవాన్లు గాయపడ్డారు. గాయపడిన వారిని హెలికాప్టర్ ద్వారా జగదల్‌పూర్ ఆసుపత్రికి తరలించారు. అయితే గత కొంతకాలంగా మావోయిస్టుల ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో పట్టు కోసం సీఆర్పీఎఫ్ క్యాంపు‌లను ఏర్పాటు చేస్తున్నారు. క్యాంపులకు వ్యతిరేకంగా స్థానిక ఆదివాసులు ఆందోళనలకు దిగారు. ఇటు మావోలు, అటు పోలీసుల హెచ్చరికల మధ్య ఆదివాసీలు నలిగిపోతున్నారు. దీనికి ప్రతిగా ఇటీవల సీఆర్పీఎఫ్ క్యాంపులపై మావోయిస్టులు పెద్ద ఎత్తున దాడులు చేశారు. ఇరు వర్గాలు ఎవరికి వారే ఎత్తులు.. పైఎత్తులు వేస్తూ.. పైచేయి సాధించడానికి దాడులు చేస్తున్నారు. మంగళవారం ఎన్‌కౌంటర్ జరిగిన ఘటనాస్థలానికి పెద్ద ఎత్తున భద్రతా బలగాలు చేరుకుని.. అడవులను జల్లెడ పడుతున్నాయి. కూంబింగ్ చేపట్టిన భద్రతా బలగాలకు మావోయిస్టుల భారీ సొరంగం బయటపడింది. కట్టెలు పేర్చి.. మనుషులు లోపలికి వెళ్లి.. వచ్చేలా ఏర్పాటు చేసుకున్నారు.

మావోయిస్టులు అడవుల్ని నివాసంగా చేసుకుని పోరాడే విషయం అందరికీ తెలిసిందే. అయితే తాజాగా ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ అడవుల్లో వారు ఏకంగా భారీ సొరంగాలు ఏర్పాట్లు చేసుకున్నారు. భద్రతా బలగాలు మావోయిస్టుల సొరంగాలను గుర్తించాయి. ఒక మనిషి నడిచే వెళ్లే అంత వెడల్పుతో.. అక్కడక్కడా గాలి, వెలుతురు కోసం తెరిచి ఉంచిన సొరంగాలను భద్రతా బలగాలు కనుగొన్నారు. ఇవి లోపల కిలోమీటర్ల మేర ఉన్నట్లు.. దాడులను తప్పించుకుని.. మావోలు షెల్టర్‌కి ఉపయోగించుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇంకా భారీగా ఆయుధాలు, టన్నెల్స్ బయటపడే అవకాశం ఉందని భావిస్తున్నారు. సీఆర్పీఎఫ్ సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది.