Viral: పెళ్లైన నెల రోజులకే భర్తకు మైండ్ బ్లాంక్.. భార్య గురించి వెలుగులోకి సంచలన నిజం..

అబ్బాయి, అమ్మాయి ప్రేమలో పడటం.. పెద్దలు ఒప్పుకోకపోతే లేచిపోయి పెళ్లి చేసుకోవడం.. ఈ కాలంలో సర్వసాధారణమైపోయింది.

Viral: పెళ్లైన నెల రోజులకే భర్తకు మైండ్ బ్లాంక్.. భార్య గురించి వెలుగులోకి సంచలన నిజం..
Representative Image

Updated on: Mar 10, 2023 | 11:55 AM

అబ్బాయి, అమ్మాయి ప్రేమలో పడటం.. పెద్దలు ఒప్పుకోకపోతే లేచిపోయి పెళ్లి చేసుకోవడం.. ఈ కాలంలో సర్వసాధారణమైపోయింది. అటు అమ్మాయి, అమ్మాయి ప్రేమించుకోవడం.. ఇంట్లో నుంచి పారిపోవడం కూడా ఈమధ్య చూస్తేనే ఉన్నాం. ఇలాంటి ఘటనలు తరచూ వార్తల్లో వస్తూనే ఉన్నాయి. అచ్చం ఇలాంటిదే తాజాగా మరొకటి జరిగింది. ఎక్కడో కాదు.. మన దేశంలోని పశ్చిమ బెంగాల్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే ఈ కథలో ఓ ట్విస్ట్ ఉంది. అదేంటో తెలిస్తే షాక్ అవ్వడం ఖాయం.

వివరాల్లోకి వెళ్తే.. ఆలిపుర్ద్వార్ జిల్లాకు చెందిన ఓ అమ్మాయి, కూచ్‌బిహార్ జిల్లా తుఫాన్‌గంజ్​ప్రాంతానికి చెందిన మరో అమ్మాయికి మధ్య కాలేజీ సమయంలోనే ఏర్పడిన స్నేహం.. ఆ తర్వాత ప్రేమగా మారింది. అయితే వీరిద్దరి ప్రేమ వ్యవహారం కాస్తా ఇంట్లో తెలిసిపోవడంతో.. తుఫాన్‌గంజ్ అమ్మాయి‌కి.. ఆమె కుటుంబసభ్యులు హడావుడిగా అదే ప్రాంతానికి చెందిన ఓ యువకుడికి ఇచ్చి పెళ్లి చేశారు. ఆ అమ్మాయికి పెళ్లైతే చేశారు గానీ.. ఆమె మనసులో ఉన్న తన ప్రేయసిని మాత్రం దూరం చేయలేకపోయారు.

సరిగ్గా పెళ్లైన నెల రోజులకు భర్తకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది సదరు యువతి. అమాంతం తన ప్రేయసితో కలిసి లేచిపోయింది. ఆ తర్వాత స్థానికంగా ఉన్న ఓ హోటల్‌లో రూమ్‌ అద్దెకు తీసుకున్నారు. కానీ వారి ప్రవర్తన సరిగ్గా లేకపోవడాన్ని గమనించిన హోటల్ సిబ్బంది.. పోలీసులకు సమాచారాన్ని అందించారు. అనంతరం విషయం తెలుసుకున్న పోలీసులు ఇరు కుటుంబసభ్యులను పోలీస్ స్టేషన్‌కు పిలిపించారు. కాగా, ఈ ఇరువురు యువతులు ఒకరిని విడిచి ఒకరం ఉండలేమని పోలీసులకు స్పష్టం చేయడమే కాకుండా.. ఇరు కుటుంబసభ్యులు తమ ప్రేమను ఒప్పుకోకపోతే ఇంటికి వెళ్ళేది లేదని స్పష్టం చేశారని తెలుస్తోంది.