ఆమె ఒకతన్ని ప్రేమించింది.. పెద్దలు వద్దన్నా కానీ.. వినకుండా ప్రేమించిన వాడే తనకు కావాలంటూ వారించింది.. చివరకు ఇంట్లో నుంచి పారిపోయిన ఆమె ఇష్టమైన వ్యక్తినే వివాహం చేసుకుంది. అయితే.. తన చేతుల్లో పెరిగిన అమ్మాయి.. ప్రేమ వివాహం చేసుకోవడం ఆమె మేనమామకు ఏమాత్రం ఇష్టం లేదు.. దీంతో ఆందోళన పడ్డాడు.. ఏదో ఒకటి చేయాలని ప్లాన్ వేశాడు.. చివరకు విందుభోజనంలో విషం కలిపాడు. ఈ షాకింగ్ ఘటన మహారాష్ట్రలోని కొల్హాపుర్ లో చోటుచేకుసుకుంది..
తన మేనకోడలు ఇష్టమైన వ్యక్తితో పారిపోయి పెళ్లి చేసుకొందన్న ఆవేదనతో ఓ మేనమామ విందు భోజనంలో విషం కలిపాడు.ఈ ఘటన కొల్హాపుర్ జిల్లా పన్హాలా పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పెళ్లి అనంతరం పెద్దలు వివాహా రిసెప్షన్ ఏర్పాటు చేయగా.. ఆ సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
ఉట్రే గ్రామంలోని మేనమామ మహేశ్ పాటిల్ ఇంట్లో ఆ అమ్మాయి (వధువు) పెరిగింది.. అయితే, తమ ఇష్టానికి వ్యతిరేకంగా పెళ్లిచేసుకోవడం కుటుంబసభ్యులకు ఏమాత్రం నచ్చలేదు. పారిపోయి పెళ్లి చేసుకోవడంతో… అయిష్టంగానే ఆ జంటను ఆశీర్వదించారు.. అనంతరం రిసెప్షన్ ఏర్పాటు చేశారు.
ఈ క్రమంలో.. కోపంతో రగిలిపోతున్న మేనమామ మహేష్ బంధువులు, అతిథుల కోసం సిద్ధం చేస్తున్న భోజనాల్లో విషం కలిపాడు. అయితే.. మహేష్ పై అనుమానంతో.. దూరం నుంచి దీన్ని గమనించిన కొందరు వ్యక్తులు వెంటనే.. అక్కడకు చేరుకున్నారు.. అనంతరం మహేష్ ను నిలదీయడంతో అతను అక్కడి నుంచి పారిపోయాడు..
దీంతో బంధువులు ఎవరూ భోజనాలు తినకుండా పోలీసులకు సమాచారం ఇచ్చారు.. అక్కడకు చేరుకున్న పోలీసులు.. వివరాలు సేకరించి.. కేసు నమోదు చేశారు.. అంతేకాకుండా ఆహార పదార్థాలను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..