MP Election 2023: ఆరుగురు సిట్టంగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు కట్.. కాంగ్రెస్‌లో భగ్గుమన్న ఆసమ్మతి

Madhya Pradesh Aassembly Election 2023: మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ తన రెండవ జాబితాను అక్టోబర్ 19న విడుదల చేసింది. అప్పటి నుంచి ఆ పార్టీ చాలా చోట్ల అసమ్మతిని ఎదుర్కొంటోంది. నిజానికి ఆరుగురు కాంగ్రెస్‌ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టిక్కెట్లు ఇవ్వలేదు. దీంతో రాష్ట్రంలోని ఈ ఎమ్మెల్యేలు పార్టీపై తిరుగుబాటు బావుటా ఎగురవేశారు.

MP Election 2023: ఆరుగురు సిట్టంగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు కట్.. కాంగ్రెస్‌లో భగ్గుమన్న ఆసమ్మతి
Mp Congress Candidate

Updated on: Oct 21, 2023 | 6:22 PM

మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ తన రెండవ జాబితాను అక్టోబర్ 19న విడుదల చేసింది. అప్పటి నుంచి ఆ పార్టీ చాలా చోట్ల అసమ్మతిని ఎదుర్కొంటోంది. నిజానికి ఆరుగురు కాంగ్రెస్‌ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టిక్కెట్లు ఇవ్వలేదు. దీంతో రాష్ట్రంలోని ఈ ఎమ్మెల్యేలు పార్టీపై తిరుగుబాటు బావుటా ఎగురవేశారు.

నవంబర్ 2020లో జరిగిన అసెంబ్లీ ఉప ఎన్నికల్లో జ్యోతిరాదిత్య సింధియా విధేయులపై నలుగురు తిరుగుబాటు ఎమ్మెల్యేలు గెలిచారు. వీరిలో సుమావాలి ఎమ్మెల్యే అజబ్ సింగ్ కుష్వాహా, బియోరా ఎమ్మెల్యే రామచంద్ర డాంగి, గోహద్‌కు చెందిన మేవరం జాతవ్, మోరెనాకు చెందిన రాకేష్ మావై ఉన్నారు. ఈ జాబితాలో చేర్చిన ఎమ్మెల్యేలలో బద్‌నగర్ స్థానం నుండి మురళీ మోర్వాల్, సెంద్వా స్థానం నుండి గ్యార్సీలాల్ రావత్ కూడా ఉన్నారు.

ఇదిలా ఉండగా, తనకు టికెట్ కేటాయించకపోవడంతో కాంగ్రెస్ పార్టీపై ఆగ్రహం వ్యక్తం చేసిన రాకేష్ మావై. రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ కమల్ నాథ్‌ను నిలదీసేందుకు సిద్ధమయ్యారు. ఏం తప్పు చేశానని టిక్కెట్ ఇవ్వలేదని మండిపడ్డారు. 2020లో కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఉప ఎన్నికలో గెలిచారు. అయితే తనకు తన కుటుంబానికి బీజేపీ నేత సింధియాతో సంబంధాలు ఉండటం తప్పా అని ప్రశ్నించారు. నిజమైన కాంగ్రెస్ కార్యకర్తనని, విద్యార్థి దశ నుంచి పార్టీతో అనుబంధం కలిగి ఉన్నానన్నారు. ఎన్‌ఎస్‌యుఐ, యూత్ కాంగ్రెస్‌లో కూడా పనిచేశానన్నారు. ఇతర అభ్యర్థుల్లా బిఎస్‌పి, బిజెపి నుంచి పార్టీలోకి రాలేదని మండిపడ్డ రాకేష్.. 2018లో జిల్లా నుండి పంచాయతీ చీఫ్ ఎన్నికలో గెలిచాను, పంచాయతీ ఎన్నికల నుండి అసెంబ్లీ ఎన్నికల వరకు ఎనిమిది సార్లు ఎన్నికల్లో పోటీ చేసి ఎన్నడూ ఓడిపోలేదు, అప్పుడు పార్టీ ఎందుకు విశ్వసించడం లేదు? అని ప్రశ్నించారు.

మరో సీనియర్ నేత మురళీ మోర్వాల్ కూడా కాంగ్రెస్ అధిష్టానం తీరుపై ఫైరయ్యారు. బీజేపీలో చేరేందుకు రూ.40 కోట్లు ఆఫర్ చేశారని, అయితే తాను కాంగ్రెస్ పార్టీకి విధేయుడిగానే ఉన్నానని మురళీ మోర్వాల్ పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వకుండా చేసిన ద్రోహాన్ని ఎప్పటికీ మరిచిపోలేనని ఆయన మండిపడ్డారు. అంతర్గత సర్వే ఆధారంగా బద్‌నగర్‌ నుంచి రాజేంద్రసింగ్‌ సోలంకీ, సెంద్వా నుంచి మోంటు సోలంకీ, సుమావాలిలో కుల్‌దీప్‌ సికర్వార్‌, బియోరాలో పురుషోత్తం డాంగీ, గోహద్‌లో కాశవ్‌ దేశాయ్‌, మొరెనాలను బరిలోకి దింపడం గమనార్హం. రాష్ట్ర కిసాన్‌ కాంగ్రెస్‌ చీఫ్‌ దినేష్‌ సింగ్‌ గుర్జర్‌కు టిక్కెట్‌ ఇచ్చారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి… 

Loading...
Unable to load recommendations.
Follow Us