Kishan Reddy: మోదీకి, రాహుల్‌ గాంధీకి మధ్య తేడా అదే.. కాంగ్రెస్‌కు ప్రజలే సమాధానం చెబుతారు: కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి

| Edited By: Shaik Madar Saheb

Sep 24, 2024 | 6:20 PM

అయితే తాజాగా కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి రాహుల్ గాంధీ ప్రచార ప్రకటనలపై విమర్శలు ఎక్కుపెట్టారు. ప్రధాని మోదీ విశ్వాసం 140 కోట్ల మంది భారతీయుల నుంచి వస్తే, రాహుల్‌ గాంధీ విశ్వాసం మాత్రం దేశ వ్యతిరేక కార్యకలాపాల నుంచి వచ్చిందని జమ్మూకశ్మీర్‌లో రాహుల్ గాంధీ ప్రచార ప్రకటనలపై వ్యగ్యంస్త్రాలు విసిరారు. గడిచిన మూడేళ్లలో కాంగ్రెస్ పార్టీ సాధించిన స్థానాలు...

Kishan Reddy: మోదీకి, రాహుల్‌ గాంధీకి మధ్య తేడా అదే.. కాంగ్రెస్‌కు ప్రజలే సమాధానం చెబుతారు: కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి
Kishan Reddy
Follow us on

జమ్మూ కశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికల రెండో దశ ఎన్నికల ప్రచారం సోమవారంతో ముగిసిన విషయం తెలిసిందే. ఇప్పటికే వివిధ రాజకీయ పార్టీలన్నీ విస్తృతంగా ప్రచారం చేశాయి. ఎలాగైనా కశ్మీర్‌లో సొంతం జెండా ఎగరవేయాలని బీజేపీ చూస్తుండగా, కాంగ్రెస్‌ సైతం తీవ్ర ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలోనే సోమవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ జమ్మూ కశ్మీర్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన కొన్ని ప్రకటనలు చేశారు.

అయితే తాజాగా కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి రాహుల్ గాంధీ ప్రచార ప్రకటనలపై విమర్శలు ఎక్కుపెట్టారు. ప్రధాని మోదీ విశ్వాసం 140 కోట్ల మంది భారతీయుల నుంచి వస్తే, రాహుల్‌ గాంధీ విశ్వాసం మాత్రం దేశ వ్యతిరేక కార్యకలాపాల నుంచి వచ్చిందని జమ్మూకశ్మీర్‌లో రాహుల్ గాంధీ ప్రచార ప్రకటనలపై వ్యగ్యంస్త్రాలు విసిరారు. గడిచిన మూడేళ్లలో కాంగ్రెస్ పార్టీ సాధించిన స్థానాలు 2024 లోక్‌ సభాలో బీజేపీకి సొంతంగా వచ్చిన స్థానాలను దాటలేకపోయిందని కిషన్‌ రెడ్డి ఎద్దేవ చేశారు.

అమలుకానీ హామీలతో ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేసినా ఆ పార్టీకి 2024 లోక్‌సభ ఎన్నికల్లో రెండంకెల స్థానాలు కూడా దక్కలేదని విమర్శించారు. జమ్మూకశ్మీర్‌లో ఓటమి ఖాయమని తెలిసే కాంగ్రెస్‌ పార్టీ దేశ వ్యతిరేక ప్రకటనలు చేస్తోంది అదే విధంగా భారత వ్యతిరేక శక్తులతో పొత్తు పెట్టుకుంటోందని కిషన్‌ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్‌ పార్టీ మిత్రుడు ఒమర్‌ అబ్ధుల్లాకు కూడా తన సొంత సామర్థ్యంపై నమ్మకం లేకపోవడంతో 2 స్థానాల నుంచి పోటీ చేస్తున్నారన్నారు. జమ్మూ కాశ్మీర్ లో రాహుల్ గాంధీ ప్రశ్నార్థక శక్తులతో పొత్తు పెట్టుకోవడం తన సొంత అవకాశాలపై ఆయనకున్న విశ్వాసం లేకపోవడాన్ని ప్రతిబింబిస్తుందన్నారు.

భారతదేశ సామర్థ్యం, ప్రధాని మోదీ నాయకత్వంపై యావత్ ప్రపంచం విశ్వాసంతో ఉందన్న కిషన్‌ రెడ్డి.. నరేంద్ర మోదీ ఇటీవలి అమెరికా పర్యటనలోనే ఇది రుజువైందని అన్నారు. అమెరికా మిత్ర దేశాలకు అవసరమైన చిప్‌లను భారత్‌ సరఫరా చేస్తుందని అమెరికా జాతీయ భద్రతా పూర్తి నమ్మకంతో ఉంది. బీజేపీకి, ప్రధాని మోదీకి.. రాహుల్ గాంధీ ఎలాంటి సర్టిఫికేట్‌ ఇవ్వాల్సిన అవసరం లేదు. మోదీ పనితీరును చూసిన ప్రజలు ఇప్పటికే ఆయనను చాలాసార్లు ఆశీర్వించారు.

ప్రపంచ వేదికపై భారతదేశ స్థాయిని పెంచడానికి నిస్వార్థంగా, అత్యంత చిత్తశుద్ధితో పనిచేసిన నాయకుడు ప్రధాని మోడీ అని.. ఆయన్ను విమర్శించే నైతికత రాహుల్ గాంధీకి లేదని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. మోదీపై 140 కోట్ల ప్రజల విశ్వాసం ఉందని.. వారు రాహుల్ గాంధీకి తగిన సమాధానం చెబుతారంటూ ఫైర్ అయ్యారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..