కేరళ క్రైస్తవ సన్యాసినికి సెయింట్‌ హోదా

కేరళకు చెందిన క్రైస్తవ సన్యాసిని (నన్) మరియం థ్రెస్సియా చిరామెల్‌ మంకిడియాన్‌‌కు సెయింట్‌ (పునీత) హోదాను పోప్‌ ప్రాన్సిస్‌ ఇవాళ ప్రకటించనున్నారు. మరింయ థ్రెస్సియా చిరామెల్‌ను సెయింట్‌గా ప్రకటించనున్నట్లు చర్చ్‌ వెల్లడించింది. రోమ్‌లోని సెయింట్‌ పీటర్‌ స్క్వేర్‌లో ఇవాళ జరగనున్న వేడుకలో ‘కాంగ్రిగేషన్‌ ఆఫ్‌ సిస్టర్స్‌ ఆఫ్‌ ద హోలీ ఫ్యామిలీ’ (సిహెచ్‌ఎఫ్‌) వ్యవస్థాపకురాలు మరియం థ్రెసియాకు ఈ హోదా ప్రకటించనున్నట్లు వాటికన్‌ సిటీ తెలిపింది. మరియంతో పాటు ఇంగ్లండ్‌కు చెందిన కార్డినల్‌ జాన్‌ హెన్రీ, స్విట్జర్లాండ్‌కు […]

కేరళ క్రైస్తవ సన్యాసినికి సెయింట్‌ హోదా
Follow us

| Edited By:

Updated on: Oct 13, 2019 | 6:46 PM

కేరళకు చెందిన క్రైస్తవ సన్యాసిని (నన్) మరియం థ్రెస్సియా చిరామెల్‌ మంకిడియాన్‌‌కు సెయింట్‌ (పునీత) హోదాను పోప్‌ ప్రాన్సిస్‌ ఇవాళ ప్రకటించనున్నారు. మరింయ థ్రెస్సియా చిరామెల్‌ను సెయింట్‌గా ప్రకటించనున్నట్లు చర్చ్‌ వెల్లడించింది. రోమ్‌లోని సెయింట్‌ పీటర్‌ స్క్వేర్‌లో ఇవాళ జరగనున్న వేడుకలో ‘కాంగ్రిగేషన్‌ ఆఫ్‌ సిస్టర్స్‌ ఆఫ్‌ ద హోలీ ఫ్యామిలీ’ (సిహెచ్‌ఎఫ్‌) వ్యవస్థాపకురాలు మరియం థ్రెసియాకు ఈ హోదా ప్రకటించనున్నట్లు వాటికన్‌ సిటీ తెలిపింది.

మరియంతో పాటు ఇంగ్లండ్‌కు చెందిన కార్డినల్‌ జాన్‌ హెన్రీ, స్విట్జర్లాండ్‌కు చెందిన మహిళ మార్గరెట్‌ బేస్‌కు, బ్రెజిల్‌కు చెందిన సిస్టర్‌ డూస్లెకు, ఇటలీకి చెందిన సిస్టర్‌ గిసెప్పినాలకు కూడా సెయింట్ హోదా ప్రకటించనున్నారు. 2000వ సంవత్సరంలో పోప్‌ సెయింట్‌ జాన్‌పాల్‌2, మరియం థ్రెసియాకు ‘బ్లెస్డ్‌’ హోదాను ప్రకటించారు. మరియం థ్రెస్సియా 1876, మే 3న బాప్టిజం స్వీకరించారు. 1914లో సిహెచ్‌ఎఫ్‌ను స్థాపించారు.