Kashmir: కశ్మీర్‌ కశ్యప్‌ కాబోతుందా.. ? ఇంతకీ కశ్మీర్ నిర్మించిన కశ్యప్ ఎవరు..?

|

Jan 03, 2025 | 9:16 AM

దేశ రాజధాని ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా కాశ్మీర్‌ గురించి ఓ సంచలన ప్రకటన చేశారు. పదివేల ఏళ్ల నాటి భారత సంస్కృతి ఉన్న కాశ్మీర్‌ దేశంలో ఓ ముఖ్య భాగమని అన్నారు. ఢిల్లీలో జరిగిన J&K అండ్ లడఖ్ త్రూ ద ఏజ్ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో అమిత్ షా ప్రసంగించారు. భారతదేశ సంస్కృతిని అర్థం చేసుకోవాలంటే.. మన దేశం సంస్కృతి, సంప్రదాయాల గురించి తెలియజేసే వాస్తవాలను అర్థం చేసుకోవాలని ఆయన అన్నారు.

Kashmir: కశ్మీర్‌ కశ్యప్‌ కాబోతుందా.. ? ఇంతకీ కశ్మీర్ నిర్మించిన కశ్యప్ ఎవరు..?
Maharshi Kashyapa
Image Credit source: social media
Follow us on

పురాతన గ్రంథాలలో ఉన్న కాశ్మీర్ జీలం గురించి తెలిసినప్పుడు.. కాశ్మీర్ అది ఎవరిది అని ఎవరూ ప్రశ్నించలేరని కేంద్ర హోంమంత్రి అన్నారు. కశ్మీర్ ఎప్పటికీ భారత్‌కే చెందుతుందని అన్నారు. ఏ చట్టమూ దానిని భారతదేశం నుంచి కశ్మీర్ ను వేరు చేయలేదని చెప్పారు. కాశ్మీర్ సంస్కృతి, చరిత్రని ప్రస్తావిస్తూ రాసిన పుస్తకాన్ని విడుదల చేసిన అమిత్ షా మహర్షి కశ్యప్ పేరును ప్రస్తావించారు.
దీనికి కారణం ఏమిటో తెలుసుకోవాలంటే కశ్మీర్ చరిత్ర తెలుసుకోవాలి.

కశ్మీర్‌పై కొత్తవాదనలు తెరతీశారు కేంద్రమంత్రి అమిత్‌షా.. బ్రిటీష్‌ పాలనలో దేశ చరిత్రను వక్రీకరించారని, కశ్మీర్‌కు పురాణాల్లో కశ్యప్‌ అనే పేరుందని అన్నారు.. దీంతో కశ్మీర్‌ పేరు కశ్యప్‌గా మార్చే ఆలోచన కేంద్రానికి ఉందా.. కశ్మీర్‌ కశ్యప్‌ కాబోతుందా ? కశ్మీర్‌ను కశ్యప్‌ అని పిలిచేవారా ? కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ఈవిషయంపై చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. మహర్షి కశ్యపుడి పేరు మీదే కశ్మీర్‌కు ఏర్పాటయ్యిందన్నారు అమిత్‌షా.. J&K and Ladakh through the ages పుస్తకావిష్కరణ సందర్బంగా అమిత్‌షా కీలక వ్యాఖ్యలు చేశారు. 10 వేల ఏళ్ల నాటి కశ్మీర్ సంస్కృతి, చరిత్రను కూడా ఆయన వివరంగా ప్రస్తావించారు. బ్రిటీష్‌ వాళ్ల కుట్రలో భాగంగానే మన ఉజ్వల చరిత్రను తుడిచిపెట్టారని అన్నారు. కశ్యప్ పేరుతోనే కశ్మీర్‌ను ఏర్పాటు చేశారన్నారు.

కశ్మీర్ ఎప్పటికీ భారత్‌కే చెందుతుంది

పురాతన గ్రంథాల్లో కూడా కశ్మీర్‌ గురంచి చాలాసార్లు ప్రస్తావన ఉందన్నారు అమిత్‌షా. కశ్మీర్ ఎప్పటికీ భారత్‌కే చెందుతుందన్నారు. కశ్మీర్‌ను భారత్‌ నుంచి వేరు చేసే ఆర్టికల్‌ 370 చట్టాన్ని రద్దు చేసినట్టు చెప్పారు అమిత్‌షా.. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ను భారత్‌లో విలీని చేసే రోజు ఎంతో దూరంలో లేదన్నారు అమిత్‌షా..

ఇవి కూడా చదవండి

కాశ్మీర్ లో మొదట నివసించింది .. కశ్యపుడి సామాజిక వర్గమని ప్రచారం

నిజానికి కశ్మీర్ చరిత్ర పురాతన కాలం నాటిది. కశ్మీర్ సంస్కృతి, దాని వైభవం గురించి పురాతన గ్రంథాలలో వివరంగా ప్రస్తావించబడింది. ప్రాచీన గ్రంథాల పుటలను తిరగేస్తే మహర్షి కశ్యపుని పేరు మీద కశ్మీర్ స్థాపించబడిందని మనకు తెలుస్తుంది. మహర్షి కశ్యపుడు ఇక్కడ తపస్సు చేశాడు. తరువాత అతని కలల రాజ్యం కశ్మీర్ స్థాపించబడింది. చరిత్రను శోధిస్తే, కాశ్మీర్ లోయలో మొదట నివసించింది కశ్యపుడి సామాజిక వర్గమని ప్రచారం ఉంది. మహాభారత కాలంలో గణపత్యార్ మరియు ఖీర్ భవానీ దేవాలయాల ప్రస్తావన కూడా ఉంది. ఇది ఇప్పటికీ కాశ్మీర్‌లో ఉంది. భూమిపై ఎక్కడైనా స్వర్గం ఉంటే, అది ఇక్కడే ఉంది. ఇది కేవలం కాశ్మీర్ ప్రకృతి సౌందర్యం గురించి మాత్రమే చెప్పనక్కర్లేదు. దీని కారణం ఇక్కడి సాంస్కృతిక చరిత్ర కూడా.

మహర్షి కశ్యపుడితో కశ్మీర్ లోయకు సంబంధించి ఒక ప్రసిద్ధ పురాణం కూడా ఉంది. జలోధవ్ రాక్షసుడు ప్రజలను పీడిస్తుండగా .. భగవతి దేవిని వేడుకున్నారు, ఆమె పక్షి రూపాన్ని ధరించి రాక్షసుడిని సంహరించింది. మహర్షి కశ్యపుడు ఇక్కడికి చేరుకున్నాడు. సరస్సు నుంచి నీటిని తీసి శుద్ధి చేసి, ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేశాడు. పురాణాల ప్రకారం, మన ప్రాచీన భారతీయ సాహిత్యంలో సప్తఋషులలో మహర్షి కశ్యపుడు ఒకరు. పురాణాల ప్రకారం మహర్షి కశ్యపుడు సృష్టికర్త బ్రహ్మ పది మంది కుమారులలో (మానస-పుత్రులు) ఒకరైన మరీచి కుమారుడు. అనేక స్మృతి గ్రంథాలను రచించారు.

అంతేకాదు బౌద్దమతం కూడా కశ్మీర్‌ నుంచే ప్రపంచవ్యాప్తంగా విస్తరించిందన్నారు. బౌద్దమత నాలుగో సమ్మేళనాన్ని సామ్రాట్‌ కనిష్కుడి సమయంలో కశ్మీర్‌ లోనే నిర్వహించారు. అక్కడ ఎన్నో సంస్కృతులకు అవకాశం కల్పించారు. భాషల్లో భిన్నత్వం భారత్‌కు ప్రతీక. కశ్మీర్‌లో కూడా మీకు అది కన్పిస్తుంది.. అందుకు ప్రధాని మోదీకి ధన్యవాదాలు.. రెండు కేంద్రపాలిత ప్రాంతాలను చేసి అధికార భాషలుగా కశ్మీరీ , డోగ్రీ , బాల్టీ , లద్దాఖీ భాషలను గుర్తించి అందరికి న్యాయం చేశారు. కశ్మీర్‌తో పాటు లద్దాఖ్‌కు ఘనచరిత్ర ఉందన్నారు అమిత్‌షా.. దేశంలోని ప్రతి మూలకు వేల సంవత్సరాల చరిత్ర ఉందన్నారు. కాని వలసపాలనలో ఈవిషయాన్ని మరుగునపెట్టే ప్రయత్నం జరిగిందని ఆరోపించారు.

మహర్షి కశ్యప్ గురించి ది కశ్మీర్ ఫైల్స్‌లో కూడా ప్రస్తావన

కశ్మీర్ గురించి ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రసిద్ధ సామెత ఉంది.. భూమిపై ఎక్కడైనా స్వర్గం ఉంటే.. అది ఇక్కడ కశ్మీర్లోనే ఉంది. ఇది కేవలం కశ్మీర్ ప్రకృతి సౌందర్యం గురించి మాత్రమే చెప్పలేదు. దీనికి కారణం అక్కడ సాంస్కృతిక చరిత్ర కూడా. ఇటీవల దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి తెరకెక్కించిన ‘ద కాశ్మీర్ ఫైల్స్’ సినిమా వార్తల్లో నిలిచింది. విశేషమేమిటంటే ఈరోజు అమిత్ షా చూపుతున్న చరిత్ర, భగవత్ పురాణం కూడా ఈ సినిమాలో ప్రస్తావనకు వచ్చాయి.

 

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..