ఢిల్లీలో పార్లమెంట్ భవనం వద్ద అనుమానితుని అరెస్ట్

జమ్మూ కాశ్మీర్ కు చెందిన ఓ వ్యక్తిని ఢిల్లీలో పార్లమెంట్ భవనం వద్ద సెంట్రల్ రిజర్వ్ పోలీసులు అరెస్టు చేశారు. జమ్మూ కాశ్మీర్ బడ్గామ్ జిల్లాకు చెందిన ఈ యువకుడు ఆ ప్రాంతంలో అనుమానాస్పదంగా తిరుగుతున్నాడని పోలీసులు తెలిపారు.

ఢిల్లీలో పార్లమెంట్ భవనం వద్ద అనుమానితుని అరెస్ట్
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Aug 26, 2020 | 1:50 PM

జమ్మూ కాశ్మీర్ కు చెందిన ఓ వ్యక్తిని ఢిల్లీలో పార్లమెంట్ భవనం వద్ద సెంట్రల్ రిజర్వ్ పోలీసులు అరెస్టు చేశారు. జమ్మూ కాశ్మీర్ బడ్గామ్ జిల్లాకు చెందిన ఈ యువకుడు ఆ ప్రాంతంలో అనుమానాస్పదంగా తిరుగుతున్నాడని పోలీసులు తెలిపారు. వారికి ఇతగాడు తన గురించి తప్పుడు సమాచారం ఇఛ్చాడని తెలుస్తోంది. ఈ వ్యక్తి నుంచి స్వాధీనం చేసుకున్న ఓ డాక్యుమెంట్ లో గుర్తు తెలియని సమాచారం కోడ్ భాషలో ఉన్నట్టు పోలీసులు చెబుతున్నారు. ఇతని ఆధార్ కార్డులో ఒకపేరు, డ్రైవింగ్  లైసెన్స్ లో మరో పేరు ఉందని, పైగా తను ఢిల్లీకి ఎప్పుడు వచ్చిందీ వేర్వేరు సందర్భాలను  పేర్కొన్నాడని సమాచారం. సెంట్రల్ రిజర్వ్ పోలీసులు ఈ వ్యక్తిని ఢిల్లీ పోలీసులకు అప్పగించారు.  ఇటీవలే అబూ యూసఫ్ అనే ఉగ్రవాదిని ఖాకీలు అరెస్టు చేసిన  నేపథ్యంలో ఈ అనుమానితుడి వ్యవహారం కూడా ఆందోళన కలిగిస్తోంది. గత ఏడాది సెప్టెంబరులో కత్తి చేతబట్టుకుని పార్లమెంట్ భవనంలోకి ప్రవేశించబోయిన ఒకరిని పోలీసులు అరెస్టు చేశారు. అతడిని ‘సాగర్ ఇన్సా’ గా గుర్తించారు.