India Corona: దేశంలో మళ్లీ పెరిగిన పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్య.. కొత్తగా ఎన్నంటే.!

| Edited By: Anil kumar poka

Sep 23, 2021 | 5:15 PM

India Corona Cases: దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. కోవిడ్ సెకండ్ వేవ్ అనంతరం.. రోజూవారీ నమోదయ్యే పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్యలో హెచ్చుతగ్గులు..

India Corona: దేశంలో మళ్లీ పెరిగిన పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్య.. కొత్తగా ఎన్నంటే.!
India Coronavirus
Follow us on

దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. కోవిడ్ సెకండ్ వేవ్ అనంతరం.. రోజూవారీ నమోదయ్యే పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్యలో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. ఒక రోజు పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్యలో పెరుగుదల కనిపిస్తే.. మరో రోజు కరోనా కేసులు, మరణాలు తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా మరోసారి పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్య పెరిగింది.

గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 26,964 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు మహమ్మారి బారినపడి 383 మంది ప్రాణాలు విడిచారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం.. దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,35,31,498కి చేరింది. అలాగే మరణాల సంఖ్య 4,45,768కి చేరుకుంది.

నిన్న కరోనా నుంచి 34,167 మంది కోలుకున్నారు. దీనితో ఇప్పటివరకు దేశంలో మహమ్మారి నుంచి కోలుకున్న వారి సంఖ్య 3,27,83,741కి పెరిగింది. ప్రస్తుతం దేశంలో 3,01,989 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. గడిచిన 186 రోజుల్లో యాక్టివ్ కేసుల సంఖ్య ఇంతలా తగ్గడం గమనార్హం. అటు కేరళలో అయితే మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. నిన్న 15,768 పాజిటివ్ కేసులు బయటపడగా.. 214 మంది కరోనా కారణంగా మృతి చెందారు. ఇదిలా ఉంటే దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా ముమ్మరంగా కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 82,65,15,754 కరోనా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్లు కేంద్రం తెలిపింది. గడిచిన 24 గంటల్లో 75,57,529 మందికి వ్యాక్సిన్ డోసులు ఇచ్చినట్లు కేంద్రం తెలిపింది.

Read Also: ఈ ఫోటోలోని జింకను కనిపెట్టండి.. మీ మెదడుకు మేత వేయండి.. ఈజీగా కనిపెట్టొచ్చు..

గాల్లో ఢీకొన్న రెండు విమానాలు.. దూకేసిన ప్రయాణీకులు.. చివరికి ఏం జరిగిందంటే.!

టీమిండియా కీలక బ్యాట్స్‌మెన్.. బీసీసీఐపై తిరగబడ్డాడు.. కెరీర్‌ను అర్ధాంతరంగా ముగించాడు.. ఎవరో తెలుసా.?

గజరాజుకు కోపమొస్తే ఇంతేనేమో.. అడవి దున్నను కుమ్మేసిందిగా.. వీడియో చూస్తే ఆశ్చర్యపోతారంతే.!