AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: పోలీసుల నిర్వాకం.. ఏకంగా స్కూల్‌నే హైజాక్ చేసిన ఓ తండ్రి..

పశ్చిమబెంగాల్‌ మాల్దాలోని ఓ ప్రైవేటు పాఠశాల తరగతి గదిలోకి చొరబడ్డ దుండగుడు చేతిలో పిస్టల్‌, పెట్రోల్‌ బాంబులతో కలకలం సృష్టించాడు. పోలీసులను అలర్ట్‌ చేయడంతో ప్రాణాలతో బయటపడ్డారు వందలాది మంది విద్యార్థులు.

Watch Video: పోలీసుల నిర్వాకం.. ఏకంగా స్కూల్‌నే హైజాక్ చేసిన ఓ తండ్రి..
West Bengal School
Shiva Prajapati
|

Updated on: Apr 27, 2023 | 11:14 AM

Share

పశ్చిమబెంగాల్‌ మాల్దాలోని ఓ ప్రైవేటు పాఠశాల తరగతి గదిలోకి చొరబడ్డ దుండగుడు చేతిలో పిస్టల్‌, పెట్రోల్‌ బాంబులతో కలకలం సృష్టించాడు. పోలీసులను అలర్ట్‌ చేయడంతో ప్రాణాలతో బయటపడ్డారు వందలాది మంది విద్యార్థులు.

వెస్ట్‌బెంగాల్‌ మాల్దా జిల్లాలోని ముచియా ఆంచల్‌ అనే ప్రైవేటు పాఠశాలలోని ఓ తరగతిగదిలోకి హఠాత్తుగా చొరబడ్డాడు ఓ దుండగుడు. చేతిలో పిస్టల్‌.. పెట్రోల్‌ బాంబులతో క్లాసులోకి చొరబడ్డ దుండగుడు పాఠశాల విద్యార్థులను చంపుతానని బెదిరిస్తూ కలకలం రేపాడు.

ఇవి కూడా చదవండి

తరగతి గదిలో ఉన్న విద్యార్థులను కదిలితే చంపేస్తానని బెదిరించిన దుండగుడి విషయం తెలిసి తల్లిదండ్రులు స్కూల్‌కి పరిగెత్తుకు వచ్చారు. హడలిపోయిన పాఠశాల యాజమాన్యం పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అత్యంత చాకచక్యంగా దుండగుడిని నిర్భంధించి, అతడిచేతిలోని ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. లోకల్‌ వ్యక్తిలాగే స్కూల్‌లోకి చొరబడ్డ దుండగుడు డిప్రెషన్‌లో ఉన్నట్టు కనిపించాడని వివరించారు స్కూల్‌ టీచర్‌ తియాషా చౌదరి.

ఏడాదిక్రితంగా ఈ దుండగుడి భార్యా, కుమారుడు కనిపించకపోవడంతో అనేకసార్లు పోలీసులకు ఫిర్యాదుచేసినా ఫలితం లేదనీ, అధికారులపై ఒత్తిడి తెచ్చేందుకు ఇతడు స్కూల్‌లోకి చొరబడ్డట్టు పోలీసులు వెల్లడించారు. ఎవరో బయటి వ్యక్తి లోపలికెళ్ళాడని మాకు మొదట సమాచారం వచ్చిందనీ, ఆ తర్వాత అతడి దగ్గర ఆయుధాలున్నాయని తెలిసిందనీ.. ఎవరికీ ఏ నష్టం జరగకుండా అతడిని నిర్భంధించామన్నారు పోలీసు అధికారులు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..