Sudden Deaths: ‘యువతలో ఎందుకీ ఆకస్మిక గుండెపోట్లు’.. రీసెర్చ్‌లు మొదలెట్టిన ICMR

|

Aug 19, 2023 | 5:26 PM

ICMR డైరెక్టర్ జనరల్ డాక్టర్ రాజీవ్ బహ్ల్ 18 నుండి 45 సంవత్సరాల వయస్సు గల వ్యక్తుల్లో చోటు చేసుకుంటున్న మరణాలను పరిశీలిస్తున్నారు. గుజరాత్‌లోని గాంధీనగర్‌లో జరిగిన WHO సదస్సులో మాట్లాడుతూ ఎలాంటి రీజన్స్ లేకుండా మరణాలు సంభవిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజంట్ ICMR ఢిల్లీ ఎయిమ్స్‌లో హఠాత్తుగా కాలం చేసిన 50 మృతదేహాలపై రీసెర్చ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తం 100 డెడ్‌ బాడీలపై పరిశోధనలు చేయాలని ICMR నిర్ణయించింది.

Sudden Deaths: యువతలో ఎందుకీ ఆకస్మిక గుండెపోట్లు.. రీసెర్చ్‌లు మొదలెట్టిన ICMR
Heart Attack
Follow us on

ప్రపంచంపై మెరుపు వేగంతో దూసుకువచ్చిన మహమ్మారి కోవిడ్. దీని బారిన పడి ఎంతో మంది ప్రాణాలు కోల్పోయాలు. ఎన్నో జీవితాల అస్తవ్యస్తమయ్యాయి. వైద్య నిపుణులు త్వరితగతిన వ్యాక్సిన్స్ అందుబాటులోకి తేవడంతో.. ఇప్పుడు పరిస్థితి నార్మల్ అయ్యింది. అయితే  కరోనా అనంతరం యువతలో గుండెపోటు మరణాలు పెరిగాయి. అసలు చడీచప్పుడు లేకుండా కూలిపోతున్నారు చాలామంది. లైఫ్ స్టైల్లో వచ్చిన తేడాలు అనుకోడానికి కూడా లేదు. ఎందుకంటే రెగ్యులర్‌గా వ్యాయామాలు చేసేవాళ్లు, డైట్ ఫాలో అయ్యేవాళ్లు సైతం హార్ట్ అటాక్స్, స్ట్రోక్స్, కార్టియాక్ అరెస్ట్‌ల కారణంగా మరణిస్తున్నారు. దేశంలో ఈ తరహా కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. టీనేజర్స్, యువత ఎక్కువగా ఇలా చనిపోవడం ఆందోళన కలిగిస్తుంది. ఈ క్రమంలో ఈ అంశంపై ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) రీసెర్చ్ మొదలెట్టింది. యువతలో హార్ట్ అటాక్స్ వెనుక కారణాలను విశ్లేషించడానికి.. రెండు రీసెర్చ్‌లు చేస్తుంది.

ICMR డైరెక్టర్ జనరల్ డాక్టర్ రాజీవ్ బహ్ల్ 18 నుండి 45 సంవత్సరాల వయస్సు గల వ్యక్తుల్లో చోటు చేసుకుంటున్న మరణాలను పరిశీలిస్తున్నారు. గుజరాత్‌లోని గాంధీనగర్‌లో జరిగిన WHO సదస్సులో మాట్లాడుతూ ఎలాంటి రీజన్స్ లేకుండా మరణాలు సంభవిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. తాజా రీసెర్చ్‌లు కరోనా, తదనంతర పరిణామాలను అర్థం చేసుకోవడంలో హెల్ప్ అవుతాయని ICMR  చెబుతోంది. ఈ మరణాలకు రీజన్స్ తెలిస్తే భవిష్యత్‌లో సంభవించే మరణాలను నిరోధించే అవకాశం ఉంటుందని చెబుతోంది. ఎలాంటి ఇతర ప్రమాదకర వ్యాధులు లేకుండా చోటు చేసుకుంటున్న ఆకస్మిక మరణాలపైనే ఈ రీసెర్చ్‌లు సాగుతున్నాయి.

ప్రజంట్ ICMR ఢిల్లీ ఎయిమ్స్‌లో హఠాత్తుగా కాలం చేసిన 50 మృతదేహాలపై రీసెర్చ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తం 100 డెడ్‌ బాడీలపై పరిశోధనలు చేయాలని ICMR నిర్ణయించింది. ఇలా చనిపోయినవారి పోస్టుమార్టం నివేదికలను, కరోనా అనంతర పరిస్ధితులతో బేరీజు వేయడం ద్వారా కారణాలు తెలుసుకుంటున్నట్లు ICMR వెల్లడించింది. కరోనా తర్వాత యువతీ యువకుల్లో చోటుచేసుకుంటున్న ఆకస్మిక మరణాల్లో హ్యూమన్ బాడీల్లో చోటు చేసుకున్న మార్పుల్ని కూడా తెలుసుకుంటోంది. మరో అధ్యయనంలో గత ఏడాదిలో 18 నుండి 45 సంవత్సరాల వయస్సులో ఆకస్మిక మరణాల డేటాను విశ్లేషిస్తుంది. ఇందుకోసం  భారతదేశంలోని 40 కేంద్రాల నుండి డేటాను తీసుకుంటుంది.  ఈ కేంద్రాలలో కోవిడ్ అడ్మిషన్లు, హాస్పిటల్ డిశ్చార్జ్, మరణాల డేటాను పరిశీలస్తుంది. అంటే గత ఏడాది కాలంలో కోవిడ్ నుంచి డిశ్చార్జ్ అయ్యాక.. మరణించడానికి ముందు ఏం జరిగిందో తెలుసుకుంటున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..