Husband Protest: పుట్టింటికి వచ్చేందుకు నిరాకరించిన భార్య.. అత్తింటి ముందు భర్త ఏం చేశాడంటే?

|

Nov 28, 2022 | 9:38 AM

రునెలల క్రితం పుట్టింటికి వెళ్లిన ఆమె ఇక అత్తింట అడుగుపెట్టలేదు. బంధువు చనిపోయాడని తల్లిదండ్రులకు వెళ్లిపోయిన ఆమె మళ్లీ మెట్టినిల్లు ముఖం చూడలేదు. ఇంటికి రావాలని భర్త పలుమార్లు వేడుకున్నా ఆమె వినిపించలేదు.

Husband Protest: పుట్టింటికి వచ్చేందుకు నిరాకరించిన భార్య.. అత్తింటి ముందు భర్త ఏం చేశాడంటే?
Husband Protest
Follow us on

ఆ దంపతులకు పెళ్లయి రెండేళ్లైంది. ఒకటిన్నర ఏళ్ల పాటు ఎంతో అన్యోన్యంగా గడిపారు. కష్ట సుఖాలను పంచుకుంటారు. అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ ఆరునెలల క్రితం పుట్టింటికి వెళ్లిన ఆమె ఇక అత్తింట అడుగుపెట్టలేదు. బంధువు చనిపోయాడని తల్లిదండ్రులకు వెళ్లిపోయిన ఆమె మళ్లీ మెట్టినిల్లు ముఖం చూడలేదు. ఇంటికి రావాలని భర్త పలుమార్లు వేడుకున్నా ఆమె వినిపించలేదు. దీంతో మరో దారిలేక ఆ భర్త అత్తమామల ఇంటి ముందు నిరసనకు దిగాడు. నా భార్యను మా ఇంటికి పంపించండి అంటూ ప్లకార్డు పట్టుకుని భైఠాయించాడు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు అక్కడ పెద్ద ఎత్తున గూమికూడారు. పోలీసులకు కూడా సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని మేదినీపూర్ జిల్లాలోని పింగ్లాలోని జమానా ప్రాంతంలో ఆదివారం ఈ ఘటన జరిగింది.

వివరాల్లోకి వెళితే.. మేదినీపూర్ జిల్లా కేశ్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆనంద్‌పూర్‌కు చెందిన పీయూష్ చక్రవర్తికి, పింగ్లా జమానానికి చెందిన అమ్మాయితో రెండేళ్ల క్రితం వివాహమైంది. ఆ తర్వాత వారి వైవాహిక జీవితం చాలా సంతోషంగా, ప్రశాంతంగా సాగింది. అయితే ఆరు నెలల క్రితం దగ్గరి బంధువు మృతి చెందాడన్న వార్త తెలియడంతో భార్య తల్లిదండ్రుల దగ్గరకు వెళ్లింది. అప్పటి నుంచి మళ్లీ ఒక్కసారి కూడా మెట్టినింటి ముఖం చూడలేదు. ఇంటికి తిరిగి రావాలని పలుమార్లు భార్యను వేడుకున్నాడు పీయూష్‌. అయితే ఆమె అసలు మాట వినలేదు. మాటలతో ఫలితం లేదనుకున్నాడేమో… భార్యను ఇంటికి తీసుకెళ్లేందుకు నేరుగా అత్తింటికి వచ్చాడు. వేడుకున్నా మాట వినకపోవడంతో అక్కడే ఆందోళనకు దిగాడు. చేతిలో ప్లకార్డుతో ధర్నాకు దిగాడు. దీంతో చుట్టుపక్కల ప్రజలు పెద్దఎత్తున వచ్చి గుమిగూడారు. సమాచారం అందుకున్న పింగ్లా పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ప్రాథమిక సమాచారం సేకరించి దర్యాప్తు ప్రారంభించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..