Harsh Vardhan: అందుకే మంత్రి పదవి పోయిందా.. హర్షవర్ధన్‌ ఉద్వాసనపై ఢిల్లీ పొలిటికల్ స్ట్రీట్‌లో పెద్ద చర్చ..

ఆ 12 మంది మంత్రులు మాత్రం ఎందుకు ఔటయ్యారన్నదే ఇప్పుడు అసలు ప్రశ్న.. వారి రాజీనామాల వెనుక వారి వయస్సు, కోవిడ్ వ్యాప్తి సమయంలో శాఖల పనితీరు, బెంగాల్‌ ఎన్నికల ప్రభావం స్పష్టంగా కనిపించింది. ఇందులో ముఖ్యంగా..

Harsh Vardhan: అందుకే మంత్రి పదవి పోయిందా.. హర్షవర్ధన్‌ ఉద్వాసనపై ఢిల్లీ పొలిటికల్ స్ట్రీట్‌లో పెద్ద చర్చ..
Harsh Vardhan

Updated on: Jul 08, 2021 | 4:06 PM

కేంద్ర మంత్రి వర్గ కూర్పు ముగిసింది. అంతా సాఫీగా జరిగింది. మోడీ జంబో కేబినెట్ స్క్రీన్‌పైకి వచ్చింది. ఇక్కడి వరకు అంతా ఓకే.. కానీ 12 మంది మంత్రులు మాత్రం ఎందుకు ఔటయ్యారన్నదే ఇప్పుడు అసలు ప్రశ్న.. వారి రాజీనామాల వెనుక వారి వయస్సు, కోవిడ్ వ్యాప్తి సమయంలో శాఖల పనితీరు, బెంగాల్‌ ఎన్నికల ప్రభావం స్పష్టంగా కనిపించింది. ఇందులో కేంద్ర సామాజిక న్యాయశాఖ మంత్రిగా ఉన్న తావర్‌చంద్‌ గెహ్లాట్‌ను వయస్సు రీత్యా మంత్రివర్గం నుంచి తప్పించి కర్ణాటక గవర్నర్‌గా నియమించింది. గెహ్లాట్‌తోపాటు విద్య, వైద్య, పర్యావరణ శాఖలకు చెందిన కేబినెట్‌ మంత్రితో పాటు సహాయమంత్రులను సైతం పక్కకు తోసేసింది. ఇలా ఎందుకు చేశారు అంటూ ఇప్పుడు ఢిల్లీ రాజకీయ వీధుల్లో పెద్ద చర్చ జరుగుతోంది.

ముఖ్యమంగా ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్‌ను తప్పించడంపై చర్చ మొదలైంది. కోవిడ్ సెకండ్‌ వేవ్‌లో దేశంలోని ఆరోగ్య సేవల పేలవమైన పరిస్థితి కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్‌ హర్షవర్ధన్‌ ఉద్వాసనకు దారితీసింది. అదే శాఖలోని సహాయమంత్రి అశ్విని చౌబేపై వేటు పడింది. బెంగాల్‌ ఎన్నికల్లో బీజేపీ ఓటమి ప్రభావంతో ఇద్దరు బెంగాల్‌కు చెందిన బాబుల్‌ సుప్రియో, దేబోశ్రీ చౌదరిని తప్పించింది. వీరితో పాటు కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి డి.వి.సదానంద గౌడ, కేంద్ర న్యాయ, ఐటీ కమ్యూనికేషన్స్‌ శాఖ మంత్రి రవి శంకర్‌ ప్రసాద్, విద్యాశాఖ మంత్రి రమేష్‌ పోఖ్రియాల్‌ నిశాంక్, పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్‌ జవదేకర్, కార్మిక శాఖ సహాయ మంత్రి (ఇండిపెండెంట్) సంతోష్‌ కుమార్‌ గంగ్వార్‌ను పీకి పక్కన పెట్టింది. వీరితోపాటు సంజయ్‌ ధోత్రే, రతన్‌లాల్‌ కటారియా, ప్రతాప్‌ సారంగీ తమ పదవులకు రాజీనామా చేశారు.

ఇదిలావుంటే.. కోవిడ్ సెకండ్‌ వేవ్‌ సమయంలో దేశవ్యాప్తంగా ఆరోగ్య సేవలు కుప్పకూలి పోయిన కారణంగా వైద్య శాఖ మంత్రిగా ఉన్న డాక్టర్‌ హర్షవర్థన్‌పై కూడా వేటు పడిందని రాజకీయవర్గాల్లో చర్చించుకుంటున్నాయి. కోవిడ్ సెకండ్‌ వేవ్‌ సమయంలో మోడీ సర్కార్ పై ప్రతిపక్షం నుంచి విమర్శలు వచ్చాయి. అయితే ఇదే కారణంతో హర్షవర్ధన్‌ పదవి నుంచి తప్పించారని గుస గుసలు వినిపిస్తున్నాయి. ఆయన సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖను కూడా నిర్వహించారు. అటువంటి పరిస్థితిలో హర్షవర్థన్‌ రాజీనామాతో 2 కీలక శాఖలు ఖాళీ అయ్యాయి.

ఇవి కూడా చదవండి : YSR Jayanti-YS Sharmila: మహానేతకు విజయమ్మ, షర్మిల నివాళులు.. YSR ఘాట్‌ వద్ద ప్రత్యేక ప్రార్ధనలు..

 Pulwama encounter: జమ్ముకశ్మీర్‌లో టెన్షన్‌..టెన్షన్‌.. 24 గంటల్లో ఐదుగురు ఉగ్రవాదుల హతం

Khadi Prakritik Paint: రైతులకు మరో గుడ్ న్యూస్.. ‘ఖాదీ పెయింట్’తో ఏడాదికి రూ.50 వేల లాభం.. ఎలానో తెలుసుకోండి..