Gyanvapi Issue: జ్ఞానవాపి మసీదు కేసులో కీలక పరిణామం.. వారు అలా.. వీరు ఇలా..!

|

May 31, 2022 | 8:22 AM

Gyanvapi Issue: జ్ఞానవాపి మసీదు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. వీడియోగ్రఫీ సర్వే నివేదికపై ముఖ్యమైన ఆదేశాలు ఇచ్చింది వారణాసి కోర్టు.

Gyanvapi Issue: జ్ఞానవాపి మసీదు కేసులో కీలక పరిణామం.. వారు అలా.. వీరు ఇలా..!
Gyanvapi Case
Follow us on

Gyanvapi Issue: జ్ఞానవాపి మసీదు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. వీడియోగ్రఫీ సర్వే నివేదికపై ముఖ్యమైన ఆదేశాలు ఇచ్చింది వారణాసి కోర్టు. జ్ఞానవాపి మసీదు వీడియోగ్రఫీ సర్వే రిపోర్ట్‌ను పిటిషనర్లకు అందచేసింది వారణాసి కోర్టు. 27 మంది పిటిషనర్లకు నివేదిక అందచేయాలని ఆదేశించింది. అయితే, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ నివేదికను బహిర్గతం చేయొద్దని పిటిషనర్లకు సూచించింది న్యాయస్థానం.

ఇదిలాఉంటే.. సర్వే నివేదికను బహిర్గతం చేయాలని హిందూ సంఘాల తరపు న్యాయవాది కోర్టును కోరారు. అలాగే జ్ణానవాపి మసీదులో లభించిన శివలింగానికి పూజలు చేసేందుకు అనుమతించాలని కూడా కోరారు. జ్ఞానవాపి మసీదు వీడియో సర్వేను బహిర్గతం చేయాలని విజ్ఞప్తి చేశారు. కానీ, ముస్లిం సంఘాలు మాత్రం వీడియోను బహిర్గతం చేయవద్దని కోర్టును కోరాయి.

ఇవి కూడా చదవండి

ఇకపోతే, సోమవారం నాడు కాశీ జ్ఞానవాపి మసీదు వివాదంపై వారణాసి ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులో వాడివేడిగా వాదనలు జరిగాయి. 47 మందిని మాత్రమే కోర్టులోకి అనుమతించారు. 1991 ప్రార్థనా స్థలాల చట్టం ప్రకారం జ్ఞానవాపి మసీదు వ్యవహారంలో ఎలాంటి మార్పులు చేయవద్దని ముస్లిం సంఘాలు వాదించాయి. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం కేసు విచారణను జులై 4వ తేదీకి వాయిదా వేసింది. అయితే, తాము వీడియోను బహిర్గతం చేయాలని కోరుతుంటే, ముస్లిం సంఘాలు ఎందుకు వద్దంటున్నాయని ప్రశ్నిస్తున్నారు హిందూ సంఘాల ప్రతినిధులు. అక్కడ నిజంగా శివలింగం లేకపోతే, వీడియోను బహిర్గతం చేయడానికి ఏంటి అభ్యంతరం అని ప్రశ్నిస్తున్నారు.